శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విద్యార్థులు దేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్, ఏప్రిల్ 15: విద్యార్థులు భారత దేశం సంస్కృతీ, సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. శుక్రవారం నెల్లూరు నగర శివారు కొత్తూరులో నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఒక్కప్పుడు ప్రపంచానికి భారతదేశం ఆది గురువని, తదనంతరం కొంతమంది దేశం మీద పడి మన విద్యా వ్యవస్థను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో కూడా గొప్ప నాయకులున్నారని, ఇంటింటికి న్యూస్‌పేపర్ వేసిన అబ్దుల్ కలామ్ దేశానికి రాష్టప్రతి అయ్యారని, టీ అంగట్లో పనిచేసిన మోది దేశ ప్రధాని అయ్యారని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత తెలివి కలిగిన వ్యక్తులకు కొదవలేదని, అలాంటివారు ప్రపంచంలో పెద్దపెద్ద కంపెనీల్లో సిఇఓలుగా వివిధ హోదాల్లో ఉన్నారని ఆయన తెలిపారు. విద్యార్థులు విద్యను ఎప్పటికప్పుడు కొత్తదనంతో తెలుసుకోవాలని, కంప్యూటర్ యుగం కావడం వల్ల కంప్యూటర్ విద్యను ప్రపంచానికి అనుగుణంగా అభ్యసించాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎవరి మాతృభాషను వారు గౌరవించుకోవాలని, మన మాతృ భాష అయిన తెలుగులో చక్కగా మాట్లాడాలని, అమ్మానాన్న అని పిలవాలని ఆయన సూచించారు. భారతదేశం రుణం తీర్చుకోవాలంటే ఉన్నతస్థాయి విద్యను అభ్యసించి దేశ అభివృద్ధికి ఉపయోగపడిననాడే భారతమాత రుణం తీర్చుకున్నట్లని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ భారతమాతాకి జై, వందేమాతరం అనే నినాదాన్ని పలకాలని ఆయన సూచించారు. భారతమాతాకి జై అంటే మన అమ్మకు నమస్కరించినట్లని, అందులో పెడ అర్థాలు లేవని, కొంత మంది రాజకీయ నాయకులు, అవకాశవాదులు తమ రాజకీయ లబ్ధికోసం మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. దేశం అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో మోది ప్రధాని కావడం దేశం చేసుకున్న అదృష్టమని, ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా దశదిశల భారత్ గొప్పతనాన్ని మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాల ద్వారా ప్రపంచ దృష్టిని భారత్ వైపు మళ్లించగలిగారని, అది మోదీకే సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారని, ఆయనకు అందరూ సహకరించాలని, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని వెంకయ్య పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రాలన్నీ మాకు సమానమని, అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. రాబోవు కాలంలో ఐదు కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి ప్రధాని మోది ప్రణాళిక సిద్ధం చేశారని ఆయన తెలిపారు. జిల్లాలో మరో రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయని, ఇప్పుడు ప్రారంభిస్తున్న విద్యాలయం ఏడున్నర ఎకరాల్లో 8 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో అత్యంత సుందరవనంగా నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఇంకా వౌళిక వసతుల కోసం స్థానిక నాయకులు, జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేయాలని, ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి నిధుల నుండి వాటర్‌ప్లాంట్‌కు నిధులు, విద్యార్థుల కంప్యూటర్ల కోసం స్వర్ణ్భారత్ ట్రస్టు తరఫున లక్ష రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బాలికలు చదువు పట్ల అత్యంత శ్రద్ధతో ఉన్నారని, వారిని ప్రోత్సహించాల్సిందిగా తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. బేటీ బచావ్, బేటీ పడావ్ అనే నినాదంతో ప్రధాన మంత్రి ముందుకు వెళుతున్నారని చెప్పారు. అనంతరం రాష్ట్ర మంత్రి నారాయణ మాట్లాడుతూ, గడిచిన 35 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్న వ్యక్తిని కాబట్టి విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసునని, అదే స్థాయిలో విద్యార్థులు తమ భవిష్యత్‌కు నాంది స్కూల్‌నుండే మొదలుకావాలని సూచించారు. విద్యలో దేశంలోనే కేరళ రాష్ట్రం 95 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 65 శాతంతో చివరి నుండి మూడో స్థానంలో ఉందని ఆయన తెలిపారు. దీనికోసంగా తెలుగుదేశం ప్రభుత్వం చదువుల పండుగ అనే పేరుతో విద్యార్థులకు చదువు యొక్క విలువను తెలియజేయడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంలో భాగంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొనే విధంగా ప్రణాళికలు ఆలోచిస్తున్నామని, ఆ దిశగా తీవ్రతరంగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. అనంతరం ఎంపి మేకపాటి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అత్యుత్తమ విద్యను నేర్చుకోవాలని, తద్వారా బంగారు భవిష్యత్‌కు విద్యార్థులు ఇక్కడ నుండే బాటలు వేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం జానకి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, జాతీయ విశ్వవిద్యాలయాల కమిషనర్ సంతోష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ వెంకటేశ్వర్లు, స్వర్ణ్భారత్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దీపా వెంకట్, పలువురు కార్పొరేటర్లు, బిజెపి, తెలుగుదేశం, వైకాపా పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.