శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పెన్నా నదిలో స్నానానికి వెళ్లి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్ 15: పెన్నా నదిలో స్నానానికి వెళ్లి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం జొన్నవాడలో చోటుచేసుకుంది. సేకరించిన సమాచారంతో పాటు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వరికుంటపాడు మండలం జడదేవికి చెందిన యాదగిరి మురళి (15) ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు నెల్లూరులోని ఓ విద్యాలయంలో శిక్షణ పొందుతున్నాడు. శ్రీరామనవమి సందర్భంగా ఆ విద్యాలయం సెలవు ప్రకటించింది. దీంతో మురళి నెల్లూరులో ఉంటున్న తన బాబాయి మాల్యాద్రి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు కలసి కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకునేందుకు జొన్నవాడ గ్రామానికి విచ్చేశారు. వారు జొన్నవాడ చేరుకునేటప్పటికి ఆలయం మూసివేశారు. ఆలయం తిరిగి తెరిచిన తరువాత స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకొని వెళ్లేందుకు వారు నిర్ణయించుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మురళి, అతని బాబాయి స్నానం చేసేందుకు పెన్నానదిలో దిగారు. లోతు లేని ప్రాంతంలో మురళి స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి లోతున్న ప్రాంతంలోకి పడిపోయాడు. దీనిని గమనించిన రేబాల గ్రామానికి చెందిన శ్రీకాంత్ రక్షించేందుకు ప్రయత్నించాడు. మురళి చేతిని పట్టుకొని పైకి తీసుకొస్తుండగా చివరి క్షణంలో అతని చేయి జారి గల్లంతయ్యాడు. దీంతో బాబాయి మాల్యాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు, అగ్నిమాపక దళం కలసి గజ ఈతగాళ్ల సహాయంతో మురళి మృతదేహాన్ని నీటి నుండి బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.