శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అభివృద్ధే బిజెపి ప్రభుత్వ నినాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఏప్రిల్ 15: అభివృద్ధే నినాదంగా కేంద్రంలో తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. వెంకటాచలంతోపాటు వింజమూరు మండల కేంద్రాల్లో 4 కోట్ల 33లక్షలతో నూతనంగా నిర్మించనున్న 30 పడకల సామాజిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల శిలాఫలకాలను శుక్రవారం ఆయన మండల కేంద్రమైన వెంకటాచలంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని, తరువాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నాలన్నారు. అప్పుడే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళతాయన్నారు. పేదల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. దేశంలో మోది ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంటే, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకెళుతుందని చెప్పారు. కేంద్రం నుండి ఆరోగ్య శాఖకు నిధులు ఇచ్చినా, వైద్య పరికరాలు కొరత లేకుండా చేసినా సేవల్లో మార్పు రాకుంటే ప్రయోజనం లేదన్నారు. ముందు వైద్యుల్లో మార్పులు రావాలని, సమయపాలన ఉంటేనే పేదవాడికి వైద్యం అందుతుందన్నారు. ఆసుపత్రులను స్థానిక ఎమ్మెల్యేలతోపాటు మంత్రులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అకస్మిక తనిఖీ చేసిన్నప్పుడే వాటి సేవలు సక్రమంగా ఉంటాయన్నారు. పనితీరులో వైద్యుల వైఖరి మార్చుకొని పేదలకు సరైన వైద్యం అందించాలన్నారు. గ్రామాల్లో రెండు సంవత్సరాలు పనిచేసిన వైద్యులకే బదిలీలు ఉంటాయని, రాజకీయ పైరవీలు ఉపయోగించి వైద్యశాఖలో బదిలీలు చేయమంటే చేసేది లేదన్నారు. రెండు సంవత్సరాలు గ్రామాల్లో పనిచేసిన వైద్యులకే పదోన్నతి ఉంటుందన్నారు. వైద్యశాఖలో మార్పులు వచ్చినప్పుడే పేదలకు వైద్యం అందుతుందన్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో ఆసుపత్రుల కొరత ఉండేదని, ప్రస్తుతం ఆ కొరత లేకుండా పోయిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాష్ట్రంలో వైద్యశాఖను ప్రక్షాళన చేయడం అభినందనీయమన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఆ ప్రాంతంలో ఆసుపత్రి బాగుండాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమన్నారు. స్వాతంత్య్రానికి ముందు దేశంలో 3 కోట్ల మందికే బ్యాంకు ఖాతాలు ఉండేవని, ప్రస్తుతం మోది ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే 20 కోట్ల మందికి బ్యాంకులో ఖాతాలు తెరిచారన్నారు. మోది వచ్చిన తరువాత 3 కోట్ల మందికి బ్యాంకు రుణాలు ఇచ్చారన్నారు. త్వరలో దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది మహిళలకు ఉచిత ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్‌లు అందజేయనున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. దేశంలో 300 ఆదర్శ మండలాలను ఎంపిక చేయగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో 5 మండలాలు ఉన్నాయని, వాటిలో వెంకటాచలం మండలాన్ని ఆదర్శ మండలంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పొంగూరు నారాయణ, ఎంపిలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, జిల్లా కలెక్టర్ జానకి, వెంకటాచలం జడ్పిటిసి సభ్యులు మందల వెంకటశేషయ్య, ఎంపిపి అరుణమ్మ, జిల్లా బిజెపి నాయకులు సురేంద్రరెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.