శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కసుమూరులో భక్తుల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వలీ దర్గాలో శనివారం భక్తుల సందడి నెలకొంది. మొదటి మూడు రోజులు మన రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా నాలుగో రోజైన శనివారం జిల్లా నలుమూలల నుంచి ఓ మోస్తరుగా భక్తులు వచ్చారు. భక్తులు మస్తాన్ వలీ దర్గాను దర్శించుకుని ప్రార్ధనలు చేశారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కొందరు భక్తులు దర్గా ఆవరణతోపాటు చందన్ మహల్, కొండపై వున్న దర్గాల వద్ద సేద తీరారు. కసుమూరు దర్గాకు వచ్చిన భక్తులు చెట్ల కింద భోజనాలు చేయడంతోపాటు దర్గా ఆవరణ, చెరువుకట్టపై వేసిన వ్యర్ధపదార్థాలతో దుర్గంధం వెదజల్లుతుండడంతో అంటువ్యాధులు వ్యాపించవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కసుమూరు గ్రామంతోపాటు రోడ్డుకు ఇరువైపుల పడి వున్న వ్యర్థాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.