శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రైతుల ఆర్థిక స్వావలంబనే టిడిపి ప్రభుత్వం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుబోలు, ఏప్రిల్ 15: రైతులు ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వం పనిచేస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ కె.హేమలత అధ్యక్షతన సోమిరెడ్డి చేతుల మీదుగా మత్స్యకారులకు సైకిళ్లు, వలలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యంను నిలువ చేసుకోవడానికి ప్రభుత్వం నియోజవర్గంలో పలుచోట్ల గిడ్డంగులను నిర్మించతలపెట్టిందన్నారు. గిడ్డంగులలో ధాన్యంను నిలువ ఉంచిన రైతుకు ఆరునెలలపాటు వడ్డీ లేకుండా ప్రభుత్వ నిర్దేశించిన ధరలో 75 శాతం రుణంగా అందజేస్తుందన్నారు. ప్రస్తుత సంవత్సరం జిల్లాలో రికార్డు స్థాయిలో సుమారు 35లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ధాన్యం లారీలను జిల్లా నుండి ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు రైతులు అమ్ముకోవడానికి వెళ్తున్న సమయంలో విజిలెన్సు, వాణిజ్య, రెవెన్యూ తదితర అధికారులు వాటిని నెలరోజులపాటు నిలుపుదల చేయరాదని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీచేసిందన్నారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటకాలువలను మరమ్మతులు చేయిస్తామన్నారు. ప్రపంచంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి తాగునీరు అందటం లేదని, అటువంటి పరిస్థితులు రాకుండా ముందుజాగ్రత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఇంటిలో ఇంకుడుగుంటలు తవ్వడానికి ప్రభుత్వం రూ.2125లను అందిస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం ఆయన రూ.7200 సబ్సిడీతో 27మంది మత్య్సకారులకు సైకిళ్లు, వలలను పంపిణీ చేశారు. సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము తయారు చేసిన పలు వస్తువులను చూసి శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి తిరివీధి రమేష్, స్థానిక తహశీల్దారు కెవి రమణయ్య, వ్యవసాయాధికారి శేషగిరి, ఇఓపిఆర్‌డి స్వరూపారాణి, మండల టిడిపి అధ్యక్షుడు గాలి రామక్రిష్ణారెడ్డి, నాయకులు రామక్రిష్ణయ్య, మస్తాన్‌నాయుడు, ముంగర విజయభాస్కర్‌రెడ్డి, రమణయ్య నాయుడు, శ్రీ్ధర్‌రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.