శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

భక్తజన ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 15: నగరంలోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగకు హాజరవుతున్న భక్తుల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతోంది. నాల్గవ రోజైన శనివారం దర్గా ప్రాంగణంతో పాటు దర్గాకు వెళ్లే దారులన్నీ జనసంద్రంగా మారిపోయాయి. శనివారం సుమారు లక్షన్నరకు పైగా భక్తులు దర్గాను సందర్శించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దర్గాలో 12 మంది వీరుల సమాధులను దర్శించుకునేందుకు వేచి ఉండే క్యూలైన్లన్నీ రద్దీగా కనిపించాయి. భక్తులను అదుపు చేయడం అధికారులకు, పోలీస్ సిబ్బందికి కష్టసాధ్యంగా మారింది. సాధారణంగా చివరి రెండు రోజులు నెల్లూరు నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా భక్తులు హాజరవుతుంటారు. ఈసారి కూడా శనివారం విచ్చేసిన వారిలో నెల్లూరువాసులే అధికంగా ఉండడం గమనార్హం.
రొట్టెల స్వీకరణ ప్రాంతంలో రద్దీ
ప్రధాన ఘట్టమైన రొట్టెల స్వీకరణ జరిగే స్వర్ణాలచెరువు వద్ద విపరీతమైన రద్దీ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా విద్య, ధనం, ఉద్యోగ, వివాహం, గృహ రొట్టెలను పట్టుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు. ఉత్సవ కమిటీ ఆయా రొట్టెలకు విడివిడిగా ప్రాంతాలను నిర్దేశించడంతో గత మూడు రోజులుగా పెద్ద రద్దీ వాతావరణం నెలకొనలేదు. అయితే శనివారం పరిస్థితి మరోలా తటస్థించింది. సూచిక బోర్డులతో సంబంధం లేకుండా తాము స్వీకరించదలచిన రొట్టె కోసం భక్తులు ఒకేచోట వెతకడంతో రద్దీ రెండు మూడు ప్రాంతాల్లోనే నెలకొనింది. ఇక్కడ భక్తులను నియంత్రించేందుకు పోలీస్ సిబ్బంది తీవ్రంగా కష్టించాల్సి వచ్చింది. ఒక సందర్భంలో వారు కూడా ఏమీచేయలేక మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రద్దీ పెరిగినప్పటికీ తొక్కిసలాట జరగకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండడంతో పరిస్థితి అంతవరకూ రాలేదు.
బరువెక్కిన నగరం
రొట్టెల పండగకు విచ్చేస్తున్న భక్తులతో నెల్లూరు నగరంలో రద్దీ వాతావరణం నెలకొంది. నగరంలోని హోటళ్లు, లాడ్జిలు యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని కెవిఆర్ కూడలి, విఆర్‌సి, ఆత్మకూరు బస్టాండ్, ఆర్టీసీ, హరనాథపురం కూడలి, పొదలకూర్ రోడ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనాలను దర్గా సమీపంలోకి పోలీసులు అనుమతించక పోవడంతో కిలోమీటరుకు పైగా దూరం కాలినడకనే భక్తులు దర్గాకు చేరుకుంటున్నారు. చంటిపిల్లలతో వస్తున్న మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆర్థిక రొట్టెనందుకున్న రూరల్ ఎమ్మెల్యే
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ఆర్థిక, మానసిక సమస్యల పరిష్కారం, కుటుంబ శ్రేయస్సు కోరుతూ శనివారం రొట్టెను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను బాగుంటే ప్రజలకు మరింతగా సేవ చేయగలననే విశ్వాసంతో తన కుటుంబ ప్రయోజనాల కోసం రొట్టెను స్వీకరించినట్లు తెలిపారు. అనంతరం దర్గాలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. దర్గాలోని షహీద్‌ల సమాధుల వద్ద ఆయన ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అదేవిధంగా నగర మేయర్ అబ్దుల్ అజీజ్, దర్గా కమిటీ చైర్మన్ జంషీద్, కమిటీ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటూ పనులను తరచూ పర్యవేక్షిస్తున్నారు.
నేటితో వేడుకకు ముగింపు
నాలుగు రోజులపాటు సాగిన రొట్టెల పండగ ఆదివారంతో ముగియనుంది. చివరిరోజు నగరవాసులు అధిక సంఖ్యలో పండగకు హాజరయ్యే అవకాశం ఉండడంతో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు, పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.