శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

టిడిపిలో ముసలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 18: జిల్లా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి. పదేళ్లపాటు పార్టీ కోసం జిల్లాలో అవిరళ కృషి జరిపిన నిజమైన పార్టీ విధేయులను పక్కనబెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత దక్కుతుండడాన్ని తెలుగు తమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు. తమ ఆవేదనను ఎవరి ముందు తెలియజేయాలో అర్ధంకాక పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రతిసారి తమ అసంతృప్తిని, తమలోని బాధను ఆవేశపూరిత ప్రసంగాలతో నేతల దృష్టికి తీసుకువస్తున్నారు. ఇటీవల నెల్లూరు నగర టిడిపి సమావేశంలో కొందరు నగర నేతలు జిల్లా నేతల ఎదుట తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ఎప్పట్నుంచో పార్టీలో ఉంటూ ఎన్నో కష్టానష్టాలను ఎదుర్కొని పదేళ్లపాటు అప్పటి అధికార పార్టీ నేతల వల్ల ఆర్థికంగా నష్టపోయి కూడా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నేతలు కొందరు పార్టీ నేతల తీరుపైనా, జిల్లా మంత్రి నారాయణ కొత్తగా వచ్చిన వారికి సహాయం చేస్తున్న వైనంపైనా కాస్త గుర్రుగానే ఉన్నారు. అయితే ఆయన ముందు ఏమీ మాట్లాడలేక కేవలం నియోజకవర్గ, నగరస్థాయి సమావేశాల్లో మాత్రమే తమ ఆక్రోశం వెళ్లబోసుకుంటున్నారు. నెల్లూరు నగరస్థాయి సమావేశంలో రాజుకున్న ఈ అసంతృప్తి జ్వాలలు మిగతా నియోజకవర్గాలకు పాకుతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమావేశంలోనూ కొందరు నేతలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు వంటి నేతల సూచనతో సమావేశం సజావుగా సాగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర సైతం పార్టీ కిందిస్థాయి నేతల బాధను అధినేత దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారనే అభిప్రాయంతో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రావడంతో ఇక కిందిస్థాయి నేతల గురించి, తనతో పాటు పార్టీ ఎదుగుదలకు కృషి చేసిన వారి గురించి ఆయన మర్చిపోయారనే బాధలో వారున్నారు. అస్మదీయులను దగ్గరకు తీసుకోవడం, నిన్నటిదాకా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేతలకు బారాషహీద్ దర్గా బాధ్యతలు అప్పజెప్పడం వంటి చర్యలు కిందిస్థాయి నేతలకు మింగుడు పడటంలేదు. వారిని అక్కున చేర్చుకుంటున్న మంత్రిని ఏమీ ప్రశ్నించలేని పరిస్థితి. కొత్తవారికి ఆహ్వానించడంలో సమస్య లేకున్నప్పటికి, పార్టీలోకి రాగానే పదవులు అప్పజెప్పడానే్న తెలుగు తమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు. తమ గోడు విని తమ బాధను పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి జిల్లా నేతలు తీసుకెళ్లాలని కింది స్థాయి నేతలు భావిస్తుంటే.. తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియని సంకటంలో జిల్లానేతలు ఉండడం కొసమెరుపు.

జిల్లాలో 13వేల 896 ఎకరాల దేవాదాయ భూములు మాయం
* స్వాధీనం చేసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశం?
కావలి, అక్టోబర్ 18 : జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ రికార్డుల ప్రకారం మొత్తం 36283 ఎకరాల 18సెంట్లు పొలాలు ఉండాల్సి ఉండగా రెవెన్యూ రికార్డుల ప్రకారం 22386.40 సెంట్లు మాత్రమే కనిపిస్తున్నాయని మిగిలిన 13896 ఎకరాలు కబ్జాదారుల చెరలో ఉండి రికార్డులు కూడా తారుమారుకు గురైనట్లు సమాచారం. ఈమేరకు గతంలో మీ ఇంటికి మీభూమి కార్యక్రమంలో ప్రతి మండలానికి ఒక ఇన్‌చార్జ్‌ని నియమించి దేవాదాయ భూములపై ప్రత్యేక దృష్టిపెట్టగా ఈ వివరాలు వెలుగు చూసినట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 46 మండలాల్లో 692 గ్రామాలలో ఉన్న 1818 దేవాలయాలు, సంస్థలకు సంబంధించి మొత్తంగా 36283.18 ఎకరాలు ఉన్నట్లు ఆశాఖ అధికారుల వద్ద ఉన్న రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 642.9 ఎకరాలు పట్టణ ప్రాంతాలలోను మిగిలిన 35.64 వేల ఎకరాల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే సర్వేనంబర్లు ఫీల్డ్ మ్యాప్‌లతో సహా మొత్తం వివరాలను సేకరించిన రాష్ట్ర అధికారులు ఈ భూముల వివరాలను తేల్చి స్వాధీనం చేసుకొని తిరిగి దేవాలయ భూములుగా రెవెన్యూ రికార్డులలో మార్పులు చేయించాలని జిల్లా దేవాదాయశాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది. ప్రతి మండలానికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మొత్తం వివరాలతో సంబంధిత తహశీల్దార్‌ను పంప్రదించి ఆ భూముల వివరాలను తెలుసుకొని వాటి ప్రస్తుత స్థితిగతులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి అన్న విషయాలను కూలంకుషంగా పరిశీలన చేయాలని కోరినట్లు సమాచారం. అలాగే అన్యాక్రాంతమైనట్లు గుర్తించిన భూముల్లో అనుభవ దారులు ఎవరైనప్పటికీ శాఖ వద్ద ఉన్న ఆధారాలను చూపి అందులో హక్కుదారుడిగా 1బి, అడంగల్‌లో నమోదు చేయించాలని మార్గ దర్శకాలు చేసినట్లు సమాచారం. అదే విధంగా ఈ వ్యవహారాన్ని అత్యంత ముఖ్యమైన విషయంగా భావించి ఆలయ భూముల రక్షణ కోసం అలాగే ఆ భూముల నుంచి బహిరంగ మార్కెట్‌లో ఉన్న డిమాండ్ మేరకు లీజు ఆదాయాలు తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా దేవాదాయ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాల వచ్చాయి. కాగా అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకొని ఆలయ భూములకు రక్షణ కల్పిస్తారో వేచి చూడాల్సి ఉంది.

జంబ్లింగ్ విధానంలోనే ఇంటర్ ప్రాక్టికల్స్
* ఆర్‌ఐఓ బాబుజాకబ్ వెల్లడి
వేదాయపాళెం, అక్టోబర్ 18: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానంలోనే నిర్వహిస్తున్నామని ఆర్‌ఐఓ బాబుజాకబ్ వెల్లడించారు. నగరంలోని ఆర్‌ఐఓ కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 ఫిబ్రవరిలో జరిగే పరీక్షల్లో ప్రాక్టికల్స్ జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలో 174 ఇంటర్ కళాశాలలు ఉండగా వాటిలో సైన్స్‌కు సంబంధించి 161 కళాశాలలు ఉన్నాయన్నారు. ఈ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 21,723 మంది విద్యార్థులు ఉన్నారని వారిలో 17,093 మంది ఎంపిసి విద్యార్థులు ఉండగా 4,630 మంది బైపిసి విద్యార్థులు ఉన్నారని వివరించారు. జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ఈ సంవత్సరం మే నెలలో 55 కళాశాలల్లో వసతులు ఏర్పాటుకు నివేదిక పంపగా బోర్డు 51 కళాశాలల్లో జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. జిల్లాలో ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించేందుకు మొత్తం 29 జోన్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు చదువుతున్న ప్రాంతాలనుబట్టి ఆ జోన్లను దాటి ఇతర జోన్లకు వెళ్లి ప్రాక్టికల్స్ చేయాల్సిన అవసరం లేదన్నారు. 51 పరీక్షా కేంద్రాల్లో 36 ప్రభుత్వ కళాశాలలు, 8 ఎయిడెడ్ కళాశాలలు, 7 ఏపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలు, ఏపి ఆర్‌జేసి కళాశాల ఒకటి, ట్రైబల్ కళాశాల ఒకటి ఉందన్నారు. జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ చేయడానికి విద్యార్థులు ఎలాంటి అపోహలు, భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటివరకు కళాశాలల్లో ఎలా ప్రాక్టికల్స్ చేశారో అలాగే పరీక్షా కేంద్రాల్లో కూడా చేసుకోవచ్చన్నారు. ప్రాక్టికల్స్‌లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈనెల 24వ తేదికల్లా పరీక్ష ఫీజులు చెల్లించాలన్నారు. 24వ తేది దాటితే 31వ తేదిలోగా అపరాధ రుసుముతో చెల్లించవచ్చన్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి చెక్‌లిస్టు వివరాలు కళాశాలల లాగిన్‌లో పొందుపరచి ఉన్నాయని కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్ ప్రతి విద్యార్థికి ఆ వివరాల కాపీని అందచేయాలని సూచించారు. చెక్‌లిస్టులో ఏమైనా తప్పులు ఉంటే ఈనెల 29వ తేదిలోపు సరిచేసి ఆర్‌ఐఓ కార్యాలయానికి పంపాలని కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్‌ను ఆయన కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
తిరుపతి ఎంపి వరప్రసాద్ స్పష్టం
సూళ్లూరుపేట, అక్టోబర్ 18: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకొంటున్నట్లు తిరుపతి పార్లమెంట్ సభ్యులు వెలగపల్లి వరప్రసాద్ తెలిపారు. మంగళవారం పరమేశ్వరినగర్‌లో ఉన్న ఆయన కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పక్కనే ఉన్న సాయినగర్‌లో మురుగుకాలువ లేకపోవడంతో ఎంపి నిధులతో అక్కడ డ్రైనేజి కాలువ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో సిసి రోడ్డుకు కూడా రూ.3 లక్షలు మున్సిపాలిటీ నుండి మంజూరు చేస్తున్నట్లు చైర్‌పర్సన్ నూలేటి విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు వంకా రామాంజనేయులు, వంకా దినేష్, సుల్తాన్ బాషా, స్థానికులు నీలిమ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.