శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రోడ్డు ప్రమాదాలు నివారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 21: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్, కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ బంగ్లాలో జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెక్నాలజి పెరిగినప్పటికీ అధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు పెరగడం శోచనీయం అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది మరణాలకు గురువుతున్నారని, ఫలితంగా వారి కుటుంబాలు అనాథలవుతున్నాయని చెప్పారు. జిల్లా ఎస్పీ విశాలగున్నీ మాట్లాడుతూ మితిమీరిన వేగం, రాంగ్‌సైడ్ పార్కింగ్, లారీల పార్కింగ్ లేకపోవడం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు కారణమన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రక్కన మద్యం దుకాణాలు కూడా ప్రమాదాలకు కారణమని చెప్పారు. ప్రమాదకర రోడ్డు మలుపులు, ప్రాంతాలు తదితర వివరాలతో జిల్లాలో రాష్ట్రంలోనే మొదటిసారిగా తాము జియోటాగింగ్ తయారు చేశామని, సంబంధిత అధికారులు ఈ వివరాలను తీసుకోవచ్చున్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ శివరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.