శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బిసిలకు ప్రభుత్వం అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, అక్టోబర్ 23: వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం సూళ్లూరుపేటలోని టివిఆర్‌ఆర్ కల్యాణ మండపంలో జరిగిన బిసి సంఘ సదస్సులో ఆయన ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 45 శాతం పైగా ఉన్న బిసి కులాలను ఆదుకొనేందుకు రూ.8,832 కోట్లతో బిసి సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు అన్నివిధాలా చొరవ తీసుకొంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనలో బిసిలను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకొందే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని పనిని తమ ప్రభుత్వం చేస్తుంటే ప్రతిపక్ష వారు ఏమి చేయనట్లు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. గత పాలకుల్లో అన్ని కార్పోరేషన్లు మూసివేసినా, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా అన్ని కులాలను ఆదుకొనేందుకు 10 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన ఘనత చంద్రబాబుదేనని దీనిని అందరూ గుర్తించుకోవాలన్నారు. ఎన్నికల హామీల్లో లేకపోయినా రాష్ట్రంలో 139 మంది బిసి కులాలు ఉండడంతో దానిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గత ఏడాది కంటే ఈ ఏడాది బడ్జెట్‌లో 31శాతం అధికంగా నిధులు కేటాయించి వారికి వివిధ రూపాల్లో రుణాలు తదితర సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పోటీ పరీక్షలైన ఐఎఎస్, ఐపిఎస్‌తో పాటు ఉన్నత చదువులను విదేశాల్లో చదువుకొనేందుకు రాష్ట్రంలో 1738 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విదేశీ చదువులకు ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చెల్లించి 500 మంది విద్యార్థులను విదేశీ చదువులకు పంపించిన విషయం ప్రతిపక్ష నాయకునికి తెలియదా అంటూ విమర్శించారు. ఏ పథకం ప్రవేశపెట్టినా, ఏ పని చేసినా జరగక ముందే విమర్శలు చేయడం వైకాపా ఆనవాయితీ అయిపోయిందని ఇలా ఉంటే ప్రజల్లో మనుగడ సాధించలేరన్నారు. ప్రతిపక్షమంటే ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. కనీసం అసెంబ్లీలో కూడా సమస్యలు ప్రస్తావించకుండా అల్లర్లు చేయడం సమంజసం కాదన్నారు. 14 ఆర్థిక సంఘ 2019 వరకు కూడా రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంటుందని చెప్పిన ఇతర రాష్ట్రాల్లో సమానంగా ఆర్థిక వృద్ధి సాధించాలని సిఎం నిరంతరం కృషి చేస్తున్నారని అందులో భాగంగానే ఇలాంటి కార్పోరేషన్‌లు ఏర్పాటు చేసి తద్వారా అందరికి ఉపాధి, ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రూ.1.7వేలు సగటు ఆదాయం ఉందని అదే తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.1.4వేలు నుండి రూ.1.70వేలు ఉందన్నారు. 2019 నాటికి దేశంలోనే మన రాష్ట్రంలో ఆదాయంలో మొదటి స్థానంలో చేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుదన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా రూ.24వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. బిసి కులాలకు కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో 15వేల కోట్ల కేటాయిస్తే చంద్రబాబు రెండేళ్లలో రూ.15వేల కోట్ల కేటాయించారని దీనిని అభినందించాల్సిపోయిన కాంగ్రెస్, వైకాపా నేతలు వీధి నాటకాలు చేస్తూ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని అప్పుడు ప్రతి కార్పోరేషన్‌ను మూసివేశామని ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకొని అన్నింటికి నిధులు కేటాయించి తద్వారా అభివృద్ధి చేస్తున్నారని దీనిని ప్రతిఒక్కరూ గుర్తించుకొని రాబోయే రోజుల్లో టిడిపికి అండగా నిలవాలన్నారు. బిసి శకం దివంగత ఎన్టీ రామారావుతో ప్రారంభమయ్యిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం పేరుతో పుత్రుడు జగన్‌కు దోచిపెట్టాడని రాష్ట్ర టిడిపి పరిశీలికుడు మాల్యాద్రి ఆరోపించారు. దోచుకొన్న వారికి మంచి పని కూడా అవినీతిమయంగా కన్పిస్తుందన్నారు. బిసిలను అన్నివిధాలా ఆదుకొనేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపి నెలవల సుబ్రహ్మణ్యం, బిసి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు, వేనాటి పరంధామరెడ్డి, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ వినుగొండ సుబ్రహ్మణ్యం, కొండేపాటి గంగాప్రసాద్, ఆనం జయకుమార్‌రెడ్డి, హరిబాబు, నూనె మల్లికార్జున్, బిసి సెల్ అధ్యక్షుడు దయాకర్‌గౌడ్, నరసింహయాదవ్, ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపాలిటి చైర్మన్లు నూలేటి విజయలక్ష్మి, శోభా, దేవసేన, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.