జాతీయ వార్తలు

డిడిసిఎ కుంభకోణం - ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైట్లీని వెనకేసుకొచ్చేందుకు ఎందుకీ వెంపర్లాట?
బిజెపి తీరుపై ధ్వజమెత్తిన ఢిల్లీ ప్రభుత్వం
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) వ్యవహారాల్లో అవకతవకలపై దర్యాప్తు జరిపేందుకు తాము నియమించిన కమిటీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి క్లీన్‌చిట్ ఇచ్చిందని బిజెపి చేస్తున్న వాదనను ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో జైట్లీకి ఇంకా క్లీన్‌చిట్ లభించనందున ఆయనపై చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేయగా, డిడిసిఎకి జైట్లీ అధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు ఆ క్రికెట్ సంఘంలో ఆర్థిక పరమైన అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి మనీష్ సిసోడియా బిజెపికి నాలుగు ప్రశ్నలు సంధించారు.
డిడిసిఎలో జరిగిన అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తు నుంచి జైట్లీతోపాటు బిజెపి ఎందుకు ‘పారిపోతోంది’ అని ఆయన నిలదీశారు. ‘డిడిసిఎలో అవకతవకలపై దర్యాప్తు జరిపేందుకు మేము నియమించిన కమిటీ తన నివేదికలో ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. అంతమాత్రాన దెయ్యాలు ఈ అక్రమాలకు పాల్పడ్డాయని భావించాలా?’ అని మనీష్ సిసోడియా ప్రశ్నించారు. డిడిసిఎలో అక్రమాలపై తాము నియమించిన త్రిసభ్య కమిటీ ఆదివారమే దర్యాప్తు ప్రారంభించిందని, ఈ కమిటీకి సారథ్యం వహిస్తున్న గోపాల్ సుబ్రమణ్యం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు అంగీకరిస్తూ ఆదివారమే సమ్మతి పత్రాన్ని అందజేశారని, అయితే ఈ దర్యాప్తుపై బిజెపి నేతలు ఎందుకు కలవరం చెందుతున్నారో, జైట్లీని వెనకేసుకొచ్చేందుకు ఎందుకు వెంపర్లాడుతున్నారో అర్థం కావడం లేదని సిసోడియా సోమవారం విలేఖర్లతో అన్నారు. ఇదిలావుంటే, డిడిసిఎలో అవకతవకలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం నియమించిన కమిటీ ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదని, కనుక జైట్లీపై తాను చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ ‘ట్విట్టర్’లో స్పష్టం చేశారు.
డిడిసిఎ వ్యవహారాల్లో పలు అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు కమిటీ ధ్రువీకరించిందని, అయితే ఈ అక్రమాలకు ఆ కమిటీ ఎవరినీ బాధ్యులుగా ప్రకటించలేదని కేజ్రీవాల్ పేర్కొంటూ, ‘ఈ అక్రమాలు జరిగినప్పుడు జైట్లీ డిడిసిఎ అధ్యక్షునిగా ఉన్న విషయం నిజం కాదా? అప్పట్లో రోజుకు 16 వేలు వెచ్చించి ల్యాప్‌టాప్‌లను అద్దెకు తీసుకున్న విషయం, ఫిరోజ్ షా కోట్లా మైదానం ఆధునీకరణ వ్యయాన్ని రూ.24 కోట్ల నుంచి రూ.144 కోట్లకు పెంచిన విషయం వాస్తవం కాదా? అప్పట్లో ఈ కాంట్రాక్టులు పొందిన కంపెనీల్లోని డైరెక్టర్లు, కొన్ని చిరునామాలు ఈ అవినీతిని స్పష్టం చేయడం లేదా? మరి ఈ అవినీతి, అక్రమాలు ఎలా జరిగాయి, ఎవరు చేశారు?’ అని నిలదీశారు.