జాతీయ వార్తలు

చిదంబరానికి లుక్‌ఔట్ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆయనకు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా సీబీఐ అధికారులు కట్టడి చేశారు. కాగా చిదంబరాన్ని అదుపులోనికి తీసుకునేందుకు సీబీఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. ఇదిలావుండగా ముందస్తు బెయిల్ కోసం చిదంబరం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు మధ్యాహాం సీజేఐ ముందుకు రానున్నది. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూప్ రూ. 305 కోట్ల విదేశీ నిధులను స్వీకరించడానికి ఫారిన్ ఇనె్వస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్‌ఐపీబీ) అనుమతించడంలో అక్రమాలు జరిగాయని సీబీఐ 2017 మే 15వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్టు తరువాత ఈడీ 2018లో కేసు నమోదు చేసింది.