జాతీయ వార్తలు

ఢిల్లీలో మళ్లీ రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపీ భవన్‌పై ఆధిపత్య పోరు తాళం వేసిన తెలంగాణ
పగులగొట్టేందుకు ఏపీ యత్నం అధికారుల మధ్య వాగ్వాదం

న్యూఢిల్లీ, మే 8: ఢిల్లీలోని ఏపీ భవన్‌పై రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది. ఏపీ, తెలంగాణ భవన్‌లోని ఉమ్మడి ఏపీ రెసిడెంట్ కమిషనర్ నివాస భవనం మాదంటే మాదని రెండు రాష్ట్రాల అధికారులు గొడవకు దిగారు. రెండు రాష్ట్రాల మధ్య ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరమవుతుంటే, దేశ రాజధానిలోని ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దేశ రాజధానిలోని ఏపీ, తెలంగాణ భవన్ అధికారులు సమస్యకు చర్చలు ద్వారా పరిష్కారం కనుగొనాల్సిందిపోయి సమన్వయలోపంతో ఒకరిపై ఒకరు దూషణలకు దిగడం పలువురిని ఆశ్చర్యపర్చింది. ఉమ్మడి ఏపీ భవన్‌పై పట్టు సాధించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల ప్రయత్నిస్తుండటపై వివాదానికి కారణంగా కనిపిస్తోంది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి భవన్‌ను ఏపీ, తెలంగాణ మధ్య 58:48 నిష్పత్తిలో విభజన చెయ్యడం జరిగింది. అయితే ఏపీ ఉమ్మడి భవన్ రెసిడెంట్ కమిషనర్ నివాస భవనాన్ని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజించకపోవడంతో వివాదం తలెత్తింది. ఏపీ పరిధిలోని రెసిడెంట్ కమిషనర్ నివాసానికి తెలంగాణ అధికారులు నోటీసు అంటీంచి తాళం వేశారని, ఎలాంటి సమాచారం లేకుండా రెసిడెండట్ కమిషనర్ నివాసానికి తాళం వేయడమేంటని ఏపీ భవన్ అధికారులు ప్రశ్నించారు. తాళాన్ని పగులగొట్టేందుకు ఏపీ అధికారులు యత్నించడంతో, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఏపీ భవన్ అసిస్టెంట్ కమిషనర్ సూర్యనారాయణ మాట్లాడుతూ సమస్యలేమైనావుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, గదికి తాళం వేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం 42 నిష్పత్తికంటే ఎక్కువ భవనాలు వినియోగిచుకుంటోందని చెప్పారు. తెలంగాణ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ రామ్మోహన్ ఈ వివాదంపై మాట్లాడుతూ రెసిడెండ్ కమిషనర్ నివాస భవనం మొదటి నుంచీ తమ పరిధిలోనే ఉందని, భద్రతా కారణాల వల్లే తాళం వేశామని చెప్పారు. ఏపీ దౌర్జన్యంగా తాళాలు పగులకొట్టడం సరికాదన్నారు. ఏపీ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణకు 42 నిష్పత్తిలో భవనాలు కేటాయించినప్పటికి, 36 శాతానికి మించి వాడుకోవడం లేదని అన్నారు. రెసిడెంట్ కమిషనర్ నివాస భవనాన్ని ఏపీ అధికారులు డార్మెటరీగా ఎలా మారుస్తారని రామ్మోహన్ ప్రశ్నించారు.