యువ

అన్నింటా నెంబర్ వన్ సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

==============
మీలో ఉన్న ఏ లోపాలను సరిచేసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఇక్కడ చాలామందికి వర్తించే కామన్ విషయాలను చూద్దాం. అందరూ తమనే అభిమానించాలని అనుకోవడం, ఎవరైనా ఏదో ఒక విషయంపై విభేదిస్తే విపరీతంగా బాధపడటం, అందమైన వారిని, ఆకర్షణీయమైన వారిని చూస్తే ఎంత వద్దనుకున్నా ఈర్ష్యకు లోనుకావడం, వేగంగాను, తెలివిగాను డబ్బు సంపాదించే వారినీ, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్న వారినీ చూస్తుంటే ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి గురవడం.
==============
చేపట్టే ప్రతి పనిలోనూ
శిఖరాగ్రాలను అందుకోవాలనే ఆరాటం మీలో పెరిగిపోతున్నదా? ప్రతి పనిలోనూ
పరిపూర్ణత సాధించాలని
భావిస్తున్నారా? ఇలా
నిరంతరం తపించిపోయేవాళ్లు తాము చేసే చిన్న చిన్న
తప్పిదాలకు కూడా తెగ
బాధపడిపోతుంటారు.
ఆత్మావలోకన చేసుకోవడానికి భయపడుతుంటారు.
అపజయాలు, అవమానాలనుంచి తప్పించుకోవడానికి ఏ విధమైన పొరబాట్లు లేకుండా ప్రతి పనినీ విజయవంతంగా పూర్తి చేయాలని, ఎప్పుడైనా, ఎక్కడైనా నెంబర్ వన్ గానే ఉండాలని
తపించిపోతుంటారు.
ఇలాంటివారు విద్యార్థి కావచ్చు, ఉద్యోగి కావచ్చు, డాక్టర్ కావచ్చు లేదా యాక్టర్ కా వచ్చు. చేసే వృత్తి ఏదైనా ఈ రకమైన ఘర్షణ తప్పదన్నమాటే. అంతఃసంఘర్షణ మంచిదే దాని రిజల్ట్ పాజిటివ్‌గా లేకపోతే మాత్రం కుంగుబాటుకు లోనవుతారు.
ఈ రకమైన మనస్తత్వం కొంతవరకూ కరెక్టే. విజయాలనందుకోవాలని, అవమానాలను దగ్గరకు రానివ్వకూడదని తపించిపోవడం, ఆ క్రమంలో కష్టించి పనిచేసి సక్సెస్‌ను సాధించడం మంచి లక్షణమే. అయితే విజయం లభించకపోతే అంతగానూ డిప్రెషన్‌కు లోనవడం ఎంతమాత్రం సమంజసం కాదు. అపజయాలు లేనివారుంటారా?
పైన చెప్పిన లక్షణాలతో సతమతమయ్యేవారు ముందుగా పరిపూర్ణత సాధించాలనే తపన వల్ల ఏయే విషయాలలో బాధ, బెంగ ఎదురవుతున్నాయో విశే్లషించుకోవడం అవసరం. మీలో ఉన్న ఏ లోపాలను సరిచేసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఇక్క డ చాలామందికి వర్తించే కామన్ విషయాలను చూద్దాం. అందరూ తమనే అభిమానించాలని అనుకోవడం, ఎవరైనా ఏదో ఒక విషయంపై విభేదిస్తే విపరీతంగా బాధపడటం, అందమైన వారిని, ఆకర్షణీయమైన వారిని చూస్తే ఎంత వద్దనుకున్నా ఈర్ష్యకు లోనుకావడం, వేగంగాను, తెలివిగాను డబ్బు సంపాదించే వారినీ, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్న వారినీ చూస్తుంటే ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌కి గురవడం.
-ఈ లక్షణాలున్నవారిలో నిరంతర తపన, టెన్షన్ ఉంటాయి. అయితే ఆటలో గెలవాలనుకోవడం తప్పుకాదు. ప్రతిసారీ విజయం తమనే వరించాలనుకోవడమే తప్పు. మీ గెలుపు మీతో ఆడే ఇతరుల సామర్ధ్యం మీద కూడా ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎప్పుడూ విజయం తమనే వరించాలని భావిస్తే మానసిక వత్తిడి పెరిగి అపజయాలకు దారి తీస్తుంది. మీకంటే ఎదుటి వ్యక్తి చక్కటి ప్రతిభాపాటవాలు కనబరిస్తే అతని విజయాన్ని ప్రశంసించే ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. అతనిని చూసి స్ఫూర్తి పొంది ఆ దిశగా మీరూ కృషి చేసి విజయాలనందుకోవాలేగానీ ఓడిపోయామనే బాధలో కుంగుబాటుకు గురి కావడం విజ్ఞులు చేసే పని కాదు. పదిమందిలో ఒకడుగా ఉండటం కంటే, పదిమందినీ నడిపించే నాయకుడిగా ఉండాలన్న మీ లక్షణం అభినందనీయం. కానీ, అలా అన్ని విషయాల్లోనూ ఉండలేమన్న సంగతిని ముందుగా గుర్తెరగడం మంచిది. నిరాశను జయించాలంటే సంతృప్తిని మొత్తం ఒకేచోట పొందాలని తాపత్రయ పడకూడదు. అభిరుచులకు తగిన రంగాలలో తమ ఆలోచనలు విస్తృతం చేయండి. చదువు, వ్యాపారం, ఉద్యోగం... వీటితోపాటు మానసికోల్లాసాన్ని ఇచ్చే కళలు, క్రీడలు వంటి రంగాల్లోనూ అడుగుపెట్టాలి. పోటీ మనస్తత్వంతో అనుక్షణం రగిలిపోకూడదు. పదిమందిలో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అం దరి దృష్టినీ ఆకర్షించాలనే తపన సబబు కాదు. దీనివల్ల ఆత్మీయులు చెప్పే కబుర్లను ఆస్వాదిస్తూ ఆనందించడం పోయి, మిగిలినవారిని ఎలా ఆకట్టుకోవాలా అన్న దానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆనందాన్ని దూరం చేసుకుంటున్నామన్న విషయాన్ని గమనించాలి. అన్నింటిలోనూ పోటీతత్వం పనికిరా దు. మీకిష్టమైన పనుల్ని హాయిగా చేయండి. మీకిష్టమైన ఆహారం భుజించడానికి సంశ యం వద్దు. మీకిష్టమైన ఫేవరేట్ మూవీ చూడండి. మీ శ్రేయోభిలాషుల్ని కలవండి. భావాలను పంచుకోండి. ఇష్టమైన పుస్తకాలు చదవడాన్ని వాయిదా వేయకండి. మనసుకు సంతృప్తినిచ్చే అంశాలలో పుస్తక పఠనం చక్క టి అలవాటు అన్న విషయాన్ని మరువకండి. ఎప్పుడూ వేగంగా వెళ్లడం కాదు వీలైనంత స్లోగా వెడుతూ చుట్టు పక్కల పరిసరాలను పరిశీలించండి. కొత్త అనుభూతులకు లోనవుతారు. అంతులేని ఆనందంతో జీవన యాత్ర సాగించడం. సాధించండి...ఆనందించండి.

-పి.వి.రమణకుమార్