బిజినెస్

నంబర్‌మాల్ చేతికి బ్యాంక్‌స్మార్ట్స్ సొల్యూషన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: హైదరాబాద్‌కు చెందిన పేమెంట్ గేట్‌వే సర్వీసెస్ వేదిక నంబర్‌మాల్.. ఢిల్లీకి చెందిన బ్యాంక్‌స్మార్ట్స్ సొల్యూషన్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు నంబర్‌మాల్ వ్యవస్థాపక సిఇఒ కిరణ్ గాలి తెలిపారు. అయితే ఎంత మొత్తానికి ఈ వ్యాపారాన్ని హస్తగతం చేసుకుంటోందన్న వివరాలను మాత్రం తెలియపరచలేదు. కాగా, ఈ కొనుగోలుతో నంబర్‌మాల్ విశే్లషణా సామర్థ్యం, వినియోగదారుల, వ్యాపార అవకాశాలు మెరుగుపడనున్నాయి.

ఇంటర్నెట్‌కు బానిసవుతున్న భారత నెటిజన్లు
హైదరాబాద్, నవంబర్ 23: ఇంటర్నెట్‌కు బానిసవుతున్న వారిలో 65 శాతం మంది భారత నెటిజన్లు ఉన్నారని టెలినార్ గ్రూప్ నిర్వహించిన ‘వర్ట్స్ ఇంటర్నెట్ హ్యాబిట్స్’ సర్వేలో వెల్లడైంది. కాగా, ఆ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం నెటిజన్లు ఈ-కార్డ్స్ పంపడం, రుచికరమైన ఆహారానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయడం వంటివి అవమానంగా పరిగణిస్తున్నట్లు ఈ సర్వేలో తేలిందని టెలినార్ తెలిపింది.. దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ వినియోగం పెరిగిందని కూడా ఈ సందర్భంగా టెలినార్ సిఇఒ శరత్ మెహ్రోత్రా తెలిపారు.

రైళ్ళలో భోజన సదుపాయానికి హలో కర్రీ ఒప్పందం
హైదరాబాద్, నవంబర్ 23: దేశీయ ప్రముఖ ఫాస్ట్ఫుడ్ చైన్ సంస్థ హలో కర్రీ రైల్వే టికెటింగ్ వ్యవస్థ ఐఆర్‌సిటిసితో ఒప్పందం కుదుర్చుకుంది. రైలు ప్రయాణీకులకు భోజన సదుపాయాలను అందించేందుకుగాను ఈ ఒప్పందం చేసుకున్నట్లు హలో కర్రీ వ్యవస్థాపకుడు, సిఇఒ రాజు భూపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆహారాన్ని ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లోనే డెలివరీ చేసే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.

మ్యాక్స్ బూపాలో 49 శాతానికి బూపా వాటా
న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశీయ హెల్త్ ఇన్సూరెన్స్ వెంచర్ మ్యాక్స్ బూపాలో బ్రిటన్‌కు చెందిన బూపా వాటా 49 శాతానికి చేరుతోంది. మ్యాక్స్ ఇండియా, బూపా కలిసి 74:26 నిష్పత్తిలో మ్యాక్స్ బూపా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటుచేశాయి. ఈ క్రమంలో వెంచర్‌లో 26 శాతంగా ఉన్న తమ వాటాను 49 శాతానికి బూపా పెంచుకుంటుండగా, 191 కోట్ల రూపాయలతో అదనంగా మరో 23 శాతం వాటాను బూపా కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు సోమవారం మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతో మ్యాక్స్ బూపా జాయింట్ వెంచర్ 51:49 శాతంగా ఉండనుంది.