రుచి

నోరూరించే నువ్వుల వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలంలో వంటల్లో నువ్వుల నూనె వాడటం, నువ్వులతో పలురకాల వంటకాలు చేయడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. రక్తహీనతను తగ్గించడానికి నువ్వులు దోహదపడతాయి. తీపి ఉండలు, అచ్చులు, కజ్జికాయలు, బొబ్బట్లు, వడలు, చెక్కలు వంటి పిండివంటల్లో వీటిని విరివిగా వాడతారు. బెండ, దొండ, ఆనపకాయ కూరల్లోనూ వినియోగిస్తారు. పెరుగుపచ్చడి, తీపిపచ్చడి వంటివి కూడా చేస్తారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీలకు నువ్వుల పొడి మంచి రుచిని ఇస్తుంది.

వడలు
బంగాళాదుంపలు-1/4 కిలో
నువ్వులు-1 కప్పు
పచ్చిమిర్చి,అల్లం పేస్ట్-4 చెంచాలు
ఉప్పు-2 చెంచాలు
నూనె -250గ్రా.
బియ్యప్పిండి - 1/2 కప్పు

తొక్క తీసిన బంగాళాదుంప ముక్కల్ని ఉడికించి ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కలుకోవాలి. దీనికి బియ్యప్పిండి, నువ్వులు చేర్చి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వడలుగా వత్తుకోవాలి. మరిగిన నూనెలో వేసి దోరగా వేపాలి.

తీపి పచ్చడి
తరిగిన బెల్లం -1 కప్పు
నువ్వులు-1 కప్పు
ఎండుమిర్చి-12
ఆవాలు, జీరకర్ర- 2 చెంచాలు
మిరియాలు-1/2 చెంచా
చింతపండు రసం -2 కప్పులు
ఉప్పు-2 చెంచాలు

నీటిలో బెల్లం, చింతపండు రసం, ఉప్పుకలిపి దగ్గరగా ఉడికించి పక్కన పెట్టాలి. శుభ్రం చేసిన నువ్వులను మిక్సీపట్టి ఈ మిశ్రమంలో కలపాలి. చివరగా పోపులు వేయించి మిక్సీపట్టి కలపాలి. ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

పెరుగు పచ్చడి
నువ్వులు -1 కప్పు
పెరుగు-2 కప్పులు
కరివేపాకు - కొంచెం
ఎండుమిర్చి-4
ఉప్పు-1 చెంచా
ఆవాలు, జీలకర్ర -2 చెంచాలు
ఇంగువ-కొంచెం
నెయ్యి-2 చెంచాలు.

నువ్వులను శుభ్రం చేసుకుని దోరగా వేయించి మిక్సీ పట్టాలి. దీన్ని పెరుగులో పోసి తగినంత ఉప్పు కలపాలి. పోపులు వేయించి ఇందులో వేయాలి. గంట తర్వాత దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ,వడ, దోశలకు బాగుంటుంది.

దొండకాయ కూర
దొండకాయలు-1/2 కిలో
ఎండుమిర్చి-24
నువ్వుపప్పు-1 కప్పు
చింతపండు రసం- 1 కప్పు
మెంతులు-1 చెంచా
ఆవాలు, జీలకర్ర-2 చెంచాలు
మినప్పప్పు, శెనగపప్పు-2 చెంచాలు
నూనె-1/2 కప్పు
ఉప్పు- 1 చెంచా
బెల్లం - చిన్నముక్క
బాణలిలో ముందుగా నువ్వు పప్పు, ఆ తర్వాత పోపులు వేయించి ఒకేసారి మిక్సీపట్టాలి. చింతపండు రసంలో బెల్లం, మెంతికారం, నువ్వు పిండి కలపాలి. దొండకాయలను నిలువుగా కోసి ఈ మిశ్రమాన్ని కూరాలి. మూకుడులో నూనె వేసి దొండకాయలను పేర్చి, ఉప్పు, కాస్త నీళ్లు చల్లి మూతపెట్టాలి. దొండకాయలు మెత్తగా అయ్యాక కాసేపు మగ్గనివ్వాలి. ఇదే పద్ధతిలో పొట్లకాయ, వంకాయ, బెండకాయ, క్యాప్సికమ్, బీర, సొరకాయ ముక్కలతో కూర వండుకోవచ్చు.

నువ్వుల పొడి
తెల్లనువ్వులు - 250 గ్రా.
జీలకర్ర-5 చెంచాలు
ఎండుమిర్చి 12
ఉప్పు-2 చెంచాలు
నూనె- 2 చెంచాలు
మినప్పప్పు - 1 చెంచాడు
శెనగపప్పు- 1 చెంచాడు
ఆవాలు-1 చెంచాడు

ముందుగా శుభ్రం చేసిన నువ్వులను దోరగా వేయించి పక్కన పెట్టాలి. బాణలిలో నూనెవేసి పోపు దినుసులు వేపాలి. ముందే వేపిన నువ్వుల్లో పోపు కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. గాలి చొరబడకుండా, తడి తగలకుండా ఉంచితే ఈ నువ్వుల పొడి నెల రోజుల వరకూ చెడిపోకుండా ఉంటుంది.

చెక్కలు
మైదాపిండి-1 కప్పు
బియ్యప్పిండి -2 కప్పులు
ఉప్పు-2 చెంచాలు
పచ్చిమిర్చి రసం-1/2 కప్పు
నువ్వులు-1 కప్పు
నూనె-250 గ్రా.
వెన్న-1 కప్పు
జీలకర్ర-2 చెంచాలు

ముందుగా మైదాలో బియ్యప్పిండి, ఉప్పు, జీలకర్ర, వెన్న కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ ముద్దలో నువ్వులు కలిపి, కాచి చల్లార్చిన నూనె వేయాలి. తగినంత వేడినీళ్లు పోస్తూ ముద్దను గట్టిగా చేసుకోవాలి. బాగా మర్దనా చేసి అరగంట సేపువదిలేయాలి. తర్వాత నిమ్మకాయంత సైజులో ఉండలుగా చేసుకుని, అరచేతిలో వత్తుకుని అక్కడక్కడా చిన్న చిల్లులు పెట్టి కాగిన నూనెలో వేపాలి. ముందుగా పిండిలో కలపడం వల్ల నూనెలోకి నువ్వులు రాలవు. నువ్వులను పైపైన అద్దితే అవి రాలిపోతాయి. ఈ చెక్కలు నెలరోజుల వరకూ నిల్వ ఉంటాయి.

-వాణి