నిజామాబాద్

వైభవంగా గోదాదేవి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జనవరి 13: ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్‌లో గల రామాలయంలో శుక్రవారం గోదాదేవి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవంలో భాగంగా ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోదాదేవి కల్యాణం నిర్వహించారు. రఘురామాచార్యులు, సత్యనారాయణ పంతులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం చేశారు. స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్ బబ్లూ పాల్గొని హారతి ఇచ్చారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షుడు గంగామోహన్ చకృ, కార్యదర్శి గుద్దేటి రమేష్, సభ్యులు జనార్ధన్ లలిత, గుండు శ్రీనివాస్, స్వాతి, ప్రజ్ఞ గంగామోహన్, గోమాకుల ఆనంద్, బేల్దారి సీను, కోలు చంద్రశేఖర్, సవితా చకృ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఛుక్కాపూర్‌లో...
మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గోదాదేవి-రంగనాయకుల కల్యాణం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా అందంగా అలంకరించిన పందిరిలో వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య గోదాదేవి-రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణం అనంతరం మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కళ్యాణ వేడుకలకు హాజరైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇఓ ప్రభు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం
* బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం

కామారెడ్డి, జనవరి 13: కార్మికుల సమస్యలను పరిష్కరించడానికే బిఎంఎస్ ఏర్పడిందని రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం అన్నారు. శుక్రవారం కొత్తబస్టాండ్ వద్ద బిఎంఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మిక సమస్యలతో పాటు జాతీయ భావాలు, దేశభక్తిని కార్మికుల్లో నింపడానికి బిఎంఎస్ పనిచేస్తుందన్నారు. గాయత్రీ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ కార్మిక వర్గానికి ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించినప్పటికీ కార్మికులు బిఎంఎస్‌కే పట్టం కట్టారని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను యాజమాన్యంతో ఎప్పటికప్పుడు చర్చిస్తు పరిష్కరిస్తామన్నారు. అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, బిఎంఎస్ ఆధ్వర్యంలో అన్ని రకాల కార్మిక సంఘాలకు పార్టీ కూడా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రతినిధులు సిద్దాగౌడ్, అనిల్‌కుమార్, నీలం రాజులు, జులూరి సుధాకర్, శ్రీనివాస్, అల్త్ఫా, అశోక్, హైమాద్, వందమంది ఆటో కార్మికులు పాల్గొన్నారు. అనంతరం బిఎంఎస్ విజయోత్సవం సందర్భంగా ఆటోలతో పట్టణంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టారు.