నిజామాబాద్

బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జనవరి 16: బహుజనుల రాజ్యాధికారమే ధ్వేయంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలని బిఎంపి జాతీయ ఉపాధ్యక్షుడు దాసురాం నాయక్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక మున్సిపల్ అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్న నేటికి ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లభించలేదన్నారు. ఈనెల 21వ తేదిన హైద్రబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బిఎంపి మొదటి మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలకు జాతీయ అధ్యక్షుడు మాలింగ్, ప్రొఫెసర్ ఎల్లన్నయాదవ్, ఇతర నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. బహుజనుల రాజ్యాధికారం కోసం తలపెట్టే మహాసభలకు కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో బిఎంపి నాయకులు వెంకట్‌రాములు, గోపి, మల్లన్న, రాజలింగం, మోహన్, గంగాధర్, లక్ష్మణ్, బాబులున్నారు.

108ను పునరుద్ధరించాలి రాస్తారోకో
భీమ్‌గల్, జనవరి 16: భీమ్‌గల్ మండల కేంద్రం నుండి తరలించిన 108వాహనాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు మండల కేంద్రంలోని సుమంగళి క్రాసింగ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. అక్కడి నుండి స్థానిక తహశీల్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లి, కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీన నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కెసిఆర్ డౌన్ డౌన్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం నాయకులు తహశీల్దార్ బావయ్యకు వినతిపత్రం అందజేశారు. అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ, భీమ్‌గల్ మండల కేంద్రం నుండి గత ఏడు మాసాల క్రితం 108వాహనాన్ని తరలించడం వల్ల మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల్లో అనుకోని రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు సంభవిస్తే ఆసుపత్రులకు తరలించేందుకు వాహనం అందుబాటులో లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా, అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ ఆందోళనలో టిడిపి, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.