నిజామాబాద్

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధారి, జనవరి 19: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ప్రజలకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని తహశీల్థార్ కార్యాలయం ఆవరలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పధకం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మానిఫెప్టోలో కల్యాణలక్ష్మి పధకం లేకున్నా నిరుపేద ప్రజలను ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని ఈ పథకం తెలంగాణలో చేపట్టడం జరుగుతుందని వివరించారు. ముందుగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని భావించడం జరిగిందని, బిసిల్లో కూడా నిరుపేదలు చాలా మంది ఉన్నందున వారికి సైతం ఈ పధకంలో భాగస్వామ్యం చేయడం జరిగిందని తెలిపారు. ఈ పథకంలో చాలా మంది దళారులను ఆశ్రయించి జరుగని పెళ్లిల్లు జరిగినట్లు, రెండవ పెళ్లి చేసుకున్న వారు కూడా ఈ పధకానికి దరఖాస్తు చేసుకుంటున్న సంఘటలను ఆయన వివరించారు. నిజమైన లబ్ధిదారులు మాత్రమే ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లేకుంటే విచారణ జరిపిన అనంతరం కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే ఎలాంటి ఆసరా లేని ఒంటరి మహిళలకు సైతం నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చే పెన్షన్ విషయమై ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం జరిగిందన్నారు. గ్రామాల్లో పెళ్లిల్లు జరిగిన ఇల్లను, ఎలాంటి ఆసరా లేని మహిళలను గుర్తించి టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు వారికి ప్రభుత్వ పధకాలు అందేలా చూడాలని కార్యకర్తలను ఎమ్మెల్యే ఆదేశించారు. దీనివల్ల నిజమైన లబ్దిదారులకు పధకాలు అందుతాయని పార్టీకీ, కార్యకర్తలకు మంచి పేరు వస్తుందని వివరించారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం మండలంలోని సోమారంలో 152 లక్షల నిధులతో నిర్మించనున్న బిటిరోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. తర్వాత జువ్వాడి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్తెయ్య, ఎల్లారెడ్డి ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, గాంధారి జడ్పీటిసి తానాజీరావు, సర్పంచ్ సత్యం, ఎంపిపి యశోదాబాయి, ఎఎంసి చైర్ పర్సన్ గీతాశ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శివాజీరావు, గాంధారి, ముదెల్లి సొసైటీ చైర్మెన్‌లు ముకుంద్‌రావు, సీతాయిపల్లి శ్రీనివాస్, తహశీల్థార్ లక్ష్మణ్, ఎంపిడిఓ సాయాగౌడ్, పార్టీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, సర్వాపూర్ సత్యం పటేల్, కమ్మరి సాయిలు, ఎంపిటిసిలు మోతీలాల్, రాంకిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.