నిజామాబాద్

మాట కంటే పాటే గొప్పది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి టౌన్, జనవరి 21: మాట కంటే పాటే గొప్పదని, కళాకారులు పాడే మాటలు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కౌడి రవీందర్ రచించిన కామారెడ్డి నూతన జిల్లాకు సంబంధించిన వీడియో అల్బమ్‌ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. జిల్లాపై పాటలను చిత్రీకరించిన బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, కలెక్టర్ సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ సుష్మ, జడ్పిటిసి సభ్యులు నంద రమేశ్, ఎంపిపి మంగమ్మ, అల్భమ్ రూపకర్తలు చక్రధర్, నిఖిల్, పురుషోత్తం, తదితరులున్నారు.

అతివేగంతో ప్రమాదాలకు ఆస్కారం
శరోడ్డు భద్రత వారోత్సవాల్లో ఎస్పీ శే్వతారెడ్డి
బాన్సువాడ, జనవరి 21: వాహనదారులు అతివేగంగా నడిపించడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుని విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని కామారెడ్డి ఎస్పీ శే్వతారెడ్డి పేర్కొన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే పోలీసు శాఖతో పాటు వాహనదారులు కూడా ఒక్క క్షణం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాహనదారుల్లో మార్పు వచ్చినప్పుడే ప్రమాద రహిత సమాజ స్థాపన సాధ్యమవుతుందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ వాహనాలను నడిపించే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సురెన్స్, ఆర్‌సి తదితర ధృవీకరణ పత్రాలను ఖచ్చితంగా తమ వెంట పెట్టుకోవాలని సూచించారు. అదే విధంగా ద్విచక్ర వాహనాలను నడిపించే వాహన చోధకులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ కోరారు. ప్రత్యేకంగా ఆటోరిక్షాల్లో పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోరాదన్నారు. డ్రైవర్లకు ఆర్టీఎ నిబంధనలు తెలియకపోవడం, తొందరపాటు, అతివేగంతో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేదంటే వాహనాల తనిఖీ చేపట్టి భారీ జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. నిజాంసాగర్ మండలం మగ్ధూంపూర్ శివార్లలో ప్రధాన కాల్వ మూల మలుపు వద్ద ఉన్న వంతెనను ఢీకొన్న సంఘటలో కారు కాల్వలో పడిపోయి బోధన్‌కు చెందిన అఫ్జల్ మృతి చెందగా, అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను ప్రాణాలకు తెగించిన కాపాడిన నడిపి తండాకు చెందిన హరిసింగ్, ఓంకార్‌లను ఎస్పీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిఎస్పీ నర్సింహారావు, సిఐలు రమణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ పురుషోత్తం, తహశీల్దార్ సిహెచ్.గోపి, తదితరులు పాల్గొన్నారు.