నిజామాబాద్

మూడు వాహనాలు ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, జనవరి 21: ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామ శివారులో గల 44వ నంబర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరణించిన వారిలో మహ్మద్ జావిద్(36), వివేక్(30)లు ఉండగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున లారీ, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ రోడ్ డివైడర్ పైకి ఎక్కింది. కాగా విషయం తెలుసుకున్న నవయుగ కంపెనీ హైవే పెట్రోలింగ్ జీపు అక్కడికి చేరుకుంది. ఈ జీపు డ్రైవర్ మహ్మద్ జావిద్ ప్రమాదానికి గురైన ట్రక్కు, లారీలను క్లియర్ చేయడానికి ప్రయత్నించగా హెచ్‌ఆర్55జె 8820 నంబర్ గల కంటేనర్ వాహనం వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల మధ్య నిలబడి ఉన్న జావిద్ నలిగిపోయి అక్కడికక్కడే మరణించాడు. అలాగే కంటేనర్‌లో ఉన్న క్లీనర్ వివేక్ కూడా మృతి చెందాడు. మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ సీతారాం తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.