నిజామాబాద్

నిజాంసాగర్ ద్వారా నీటి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, జనవరి 22: నిజాంసాగర్ ప్రాజెక్ట్ హెడ్‌స్లూస్ జలవిద్యుత్ కేంద్రానికి అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్ కేంద్రం రెండు గేట్ల ద్వారా 1750 క్యూసెక్‌ల నీటిని ప్రధాన కాలువలోనికి విడుదల చేస్తున్నామని ప్రాజెక్డ్ డిప్యూటీ ఇఇ దత్తాత్రి ఆదివారం తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద యాసంగిలో రైతులు పంటలు వేసుకునేందుకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్ డిస్ట్రీబ్యూటర్ల వద్ద నీటి పారుదల శాఖ సిబ్బంది, గ్రామ రెవెన్యూ సహాయకులను భద్రతగా నియమించడం జరిగిందన్నారు. నీటి చౌర్యం, వృథాకాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. నిజాంసాగర్‌ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులకు గాను 1400.80 అడుగుల నీరు నిల్వఉందని, 17.802 టిఎంసిలకు గాను 12.238 టిఎంసిల నీరు నిల్వఉందని తెలిపారు. ప్రాజెక్ట్ ద్వారా యాసంగి పంటలకు రెండవ విడతగా ఈనెల 8వ తేదినుంచి నీటి విడుదల కొనసాగుతోందన్నారు. రెండు రోజుల్లో నీటివిడుదలను నిలుపదల చేయనున్నుట్లు తెలిపారు.

1.54 కోట్ల మొక్కలు పెంచడమే లక్ష్యం
నర్సరీల నిర్వహణ పట్ల డిఎఫ్‌ఆర్‌ఓపై కలెక్టర్ ఆగ్రహం
కామారెడ్డికలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ

ఎల్లారెడ్డి, జనవరి 22: తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మంగా అమలు చేసిన హరితహారం పథకంలో భాగంగా 2017-18 సంవత్సరానికి గాను జిల్లాలోని 120 నర్సరీలలో కోటి 54 లక్షల మొక్కలను పెంచేందుకు లక్ష్యం పెట్టుకున్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని సబ్ధల్‌పూర్, శివ్వానగర్, జంగమాయిపల్లిగ్రామాల శివారుల్లోగల నర్సరీలను జిల్లాకలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపిడిఓ సతీష్‌రెడ్డి, ఇజిఎస్ ఇసి సాయులతో నర్సరీలలో నాటుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జంగమాయిపల్లి నర్సరీలో ప్లాంటేషన్ పనులను చూసి కలెక్టర్ ఇజిఎస్ సిబ్బంది పనితీరును మెచ్చుకుని సంతృప్తివ్యక్తం చేసి ఈనెలఖరులోగా నర్సరీల్లోప్లాంటేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. అంతకు ముందు శివానగర్‌లో అటవీశాఖ వారి ఆధ్వర్యంలో పెంచుతున్న ఈత, వివిధ రకాల మొక్కలను చూసి, కొన్ని మొక్కలు పెరిగి ఎండిపోవడం పట్ల డిఎఫ్‌ఆర్‌ఒ రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీకి సంబందించిన మొక్కల వివరాల షెడ్యుల్‌కు సంబందించి ఫ్లేక్సి పై వివరాలు డిస్ప్లే చేయక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ విలేఖరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా హరితహారం పథకంలో భాగంగా 120 నర్సరీలలో కోటి 54 లక్షల మొక్కలను పెంచేందుకు లక్ష్యం పెట్టుకున్నామన్నారు. అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో కోటి 25 వేలు, డ్వామా వారి ఆధ్వర్యంలో 50 లక్షలు, లక్షన్నర మొక్కలను హర్టికల్చర్ వారి ఆధ్వర్యంలో నర్సరీలలో పెంచనున్నట్లు తెలిపారు. వీటిలో 74 లక్షల టేకు మొక్కలను రైతుల సౌకర్యార్థం పెంచడం జరుగుతోందన్నారు. అలాగే 15లక్షల ఈత మొక్కలు పెంచుతున్నామని, వీటిలో 5 లక్షలు వచ్చే సంవత్సరం కోసం ముందస్తుగానే పెంచుతున్నామని అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 80 నర్సరీలు, డ్వామా వారి ఆధ్వర్యంలో 39 నర్సరీలు, హర్టీకల్చర్ వారి ఆధ్వర్యంలో 1 నర్సరీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఈనెలఖరులోగా జిల్లాలోని అన్ని నర్సరీలలోమొక్కలు నాటే కార్యక్రమం పూర్తిచేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. త్వరలోనే జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు మంజూరు చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎంపిడిఓ సతీష్‌రెడ్డి, ఇజిఎస్ ఇసి సాయులు, టిఎలు చంద్రశేఖర్, సత్యప్రసాద్, రేపల్లెవాడ ఉపసర్పంచ్ సాయిరాం తదితరులు ఉన్నారు.