నిజామాబాద్

సాగుకు అనుకూలంగా లేని అసైన్డ్ భూముల వివరాలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 30: నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు జీవనోపాధి కల్పిస్తూ వారి ఆర్ధికాభివృద్ధికి దోహదపడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం లబ్ధిదారులకు అసైన్డ్ భూములను పంపిణీ చేసినప్పటికీ, చాలాచోట్ల సదరు భూములు ఏళ్ల తరబడి నిరుపయోగంగానే ఉండిపోతున్నాయని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో ఆమె రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ పథకాల కింద లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూములను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని, సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించి వాటి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. లబ్ధిదారుల వారీగా, సర్వే నెంబర్లను పొందుపరుస్తూ రూపొందించిన నివేదికలను సంబంధిత ఎంపిడిఓలకు సమర్పించాలన్నారు. ఒక్కో లబ్ధిదారుడి వారీగా ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణం మేరకు వారికి పంపిణీ చేసిన భూమి ఉందనే విషయాన్ని నివేదికలో స్పష్టంగా పొందుపర్చాలని సూచించారు. ఈ నివేదికలను పరిశీలించి, లబ్ధిదారుల భూములను పంటల సాగుకు అనువుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ఎంపిడిఓలను ఆదేశించారు. అసైన్డ్ భూములను సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు జరిపించాలన్నారు. పంటల సాగుకు అనువుగా మారిన భూముల్లో బోరుబావులు తవ్వించడం, బిందు, తుంపర్ల సేద్యం యూనిట్లను మంజూరు చేసి లబ్ధిదారులు పంటలు సాగు చేసేలా తోడ్పాటును అందించాలని మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. భూసారాన్ని బట్టి ఏ రకమైన పంటలు సాగు చేసేందుకు నేల స్వభావం అనుకూలంగా ఉందనేది నిర్ధారించి లబ్ధిదారులకు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్, ఆర్డీఓలు సమన్వయంతో పని చేస్తూ సాధ్యమైనంత త్వరగా సమగ్ర నివేదిక అందించేందుకు చొరవ చూపాలన్నారు.
సాదాబైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
కాగా, సాదాబైనామా కింద వచ్చిన దరఖాస్తులను వెంటది వెంట పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ యోగితారాణా తహశీల్దార్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు కలిగి ఉన్న వారికి వెంటనే పట్టాదార్ పాసు పుస్తకాలు జారీ చేయాలన్నారు. సాదాబైనామాకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నందున, దరఖాస్తుల పరిశీలనలో అలసత్వానికి తావివ్వరాదని సూచించారు. పరిశీలన జరిపిన దరఖాస్తులను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, ఈ అప్‌లోడ్ ప్రక్రియను వెంటది వెంట చేపట్టకపోవడం వల్లే పెండింగ్ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు. వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసే విషయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ఎన్‌ఐసి జిల్లా అధికారిని సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, డిఆర్‌ఓ పద్మాకర్, డిఆర్‌డిఎ పి.డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.