నిజామాబాద్

పేదల జీవితాలతో మోదీ చెలగాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జనవరి 31: పెద్దనోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్రమోదీ, పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, అందుకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎఐసిసి కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంత్‌రావు పేర్కొన్నారు. మంగళవారం నోట్ల రద్దుకి నిరసనగా నగరంలో గాంధీచౌక్‌లో నిర్వహించిన రోడ్‌షోలో భాగంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నవంబర్ 8వ తేదీన పెద్దనోట్లను రద్దు చేసి రెండు మాసాలు కావస్తున్నా, ఇంకను ప్రజలకు నోట్ల ఇబ్బందులు తీరడంలేదని ఆరోపించారు. నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎస్పీ నేత మూలయంసింగ్‌యాదవ్, బిఎస్పీ నేత మాయావతి, తృణముల్ కాంగ్రెస్ మమత బెనర్జీ ప్రశ్నించారని, అయితే ప్రధాని మోదీ తనను పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు తనను మాట్లాడనీయలేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, గుజరాత్ పెట్టుబడిదారుల నుండి మోదీ ముడుపులు తీసుకున్నారని ఆరోపించినా, మోదీ సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారన్నారు. దేశంలో మోదీ వస్తే అచ్చేదిన్ వస్తాయని బిజెపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయని, మరి అచ్చే దిన్ ప్రజలకు ఎప్పుడు వస్తాయో తెలపాలన్నారు. నోట్ల రద్దు చేసి పేదలను రోడ్డుపాలు చేయడమే అచ్చేదిన్ అని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని దేశానికి తీసుకవస్తామని చెప్పిన మోదీ, అవినీతి, అక్రమార్కులను నియంత్రించేందుకు పెద్దనోట్లను రద్దు చేసి కోటీశ్వరులను కాకుండా పేదలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడం జరిగిందని, ఎన్డీయే హయాంలో ఏ ఒక్క రైతుకు రుణమాఫీ జరగలేదన్నారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో ప్రజా సంక్షేమం పట్టని ప్రధాని మోదీ, యుపి ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే యువతకు ల్యాప్‌టాప్‌లు ఉచితంగా అందిస్తామని హామీలు గుప్పిస్తోందన్నారు. ఈ హామీలపై తాను ఎలక్షన్ కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే విజయమాల్యను కాంగ్రెస్ పార్టీయే దేశం బయటకు పంపిందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారని, ఇది శుద్ధ అబద్ధమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి సృజన చౌదరి, ప్రజలంతా డెబిట్, క్రెడిట్ కార్డులను వాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నారని, అమెరికా లాంటి దేశాల్లోనే నగదు రహిత లావాదేవీలు సాధ్యం కాలేదని, మరి ఇండియాలో ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నోట్ల రద్దు తర్వాత ఇది దిక్కుమాలిన చర్య అని పేర్కొన్నారని, ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత నోట్ల రద్దు సబబేనంటూ పేర్కొనడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సిఎం కెసిఆర్‌తో పాటు ఆయన కుమార్తె, కొడుకు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయాన్ని టిఆర్‌ఎస్ నాయకులు మరిచిపోవద్దని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, రాష్ట్ర మైనార్టీ చైర్మన్ ఫక్రుద్దీన్, ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, కేశ వేణు, సుమీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.