నిజామాబాద్

క్రీడలతో మానసికోల్లాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఫిబ్రవరి 5: క్రీడలతో శారీరక వికాసం, మానసికోల్లాసం కలుగుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులే కాకుండా ఉద్యోగులు కూడా తమ దైనందిన జీవితంలో క్రీడలకు కొంత సమయం కేటాయించాలని ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి సూచించారు. ఆదివారం నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో టిఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో 26వ జిల్లా స్థాయి ఇంటర్ డిపార్ట్‌మెంటర్ స్పోర్ట్స్ మీట్-17ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మాట్లాడుతూ, టిఎన్జీవోల క్రీడలు 2009 నుండి జరుగుతున్నాయని, కొంత విరామం అనంతరం మళ్లీ ఈ క్రీడలను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. జిల్లా అధ్యక్షుడు కిషన్ నాయకత్వంలో టిఎన్జీవోల సంఘం క్రీడా పోటీలు పూర్వవైభవాన్ని సంతరించుకుంటాయనే నమ్మకం ఉందన్నారు. క్రీడలు అంటే చిన్నారులు, విద్యార్థులే ఆడతారని అనుకుంటారని, కానీ స్పోర్ట్స్ అంటే పెద్దలు కూడా భాగస్వాములు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. క్రీడల వల్ల అనేక లాభాలు ఉన్నాయని, దీనిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. బంగారు తెలంగాం నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర ఎంతో క్రియాశీలమైనందున, వారు ఒత్తిడిని దూరం చేసుకుని మానసికోల్లాసం పెంపొందించుకునేందుకు, శారీరక దృఢత్వం కోసం క్రీడల్లో విరివిగా పాల్గొనాలని హితవు పలికారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, మరింత త్వరితగతిన ప్రగతి కోసం ఉద్యోగులు కూడా తమవంతు కృషి చేస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ పద్మాకర్, నగర మేయర్ ఆకుల సుజాత, టిఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, సతీష్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్, విఆర్‌ఓల సంఘం అధ్యక్షుడు భూపతిప్రభు, వి.ప్రభాకర్, మాజీ అధ్యక్షుడు భూమాగౌడ్, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతు బజారు ఏర్పాటు
ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి రూ. 66 లక్షలు
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

కామారెడ్డి, ఫిబ్రవరి 5: రైతు సంక్షేమమే ధ్వేయంగా గంజ్‌లో రైతు బజారును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహాంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుభాష్ రోడ్డు డేలీ మార్కెట్‌లో కూరగాయాల విక్రయానికి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న దృష్ట్యా గంజ్‌లోనే మార్కెట్ యార్డును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కామారెడ్డి ఏరియాసుపత్రిలోని పిల్లల విభాగం, మార్చురీ, తదితర విభాగాల అభివృద్ధి కోసం 66 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. మార్కెట్ యార్డు అభివృద్ధి, ఆసుపత్రికి నిధులు కేటాయించినందుకు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిలకు ప్రభుత్వ విప్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కామారెడ్డి ఏరియా ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా మార్చే అవకాశం ఉందన్నారు. కామారెడ్డి పట్టణ సమీపంలో 5,6 ఎకరాల్లో ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో రోగుల తాకిడి ఎక్కువ కావడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రతిరోజు ఆసుసత్రికి 700మంది ఒపి వస్తున్నారని, నెలకు 300 ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. వైద్య సిబ్బంది కొరత ఉన్న రోగుల పట్ల సేవలు చేయడాన్ని పిల్లల వైద్యులతో పాటు సిబ్బందిని ప్రభుత్వ విప్ అభినందించారు. రాబోయో రోజుల్లో ఏరియా ఆసుపత్రిలో పిల్లల, ప్రసూతి ఆసుపత్రిగా విభజించేందుకు ప్రణాళికలు తయారు అవుతాయన్నారు. ఈ సమావేశంలో జడ్పీటిసి నంద రమేశ్, మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మ, టిఆర్‌ఎస్ నాయకులు మంద వెంకటేశ్వర్‌రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, జుకంటి మోహన్‌రెడ్డి, గైని శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గౌరి శంకర్, బల్వంత్‌రావు, ప్రసాద్, గెరిగంటి లక్ష్మీనారాయణ, అంజిల్‌రెడ్డి, ప్రకాశ్, ప్రభాకర్‌రెడ్డి, తదితరులున్నారు.

ప్రయోగాత్మక దశకే పరిమితం ‘్భ భారతి’
దశాబ్ద కాలం గడిచినా అందుబాటులోకి రాని వైనం

నిజామాబాద్, ఫిబ్రవరి 5: బ్రిటీష్ కాలం నాటి చట్టాల వల్ల ఎదురవుతున్న ఇక్కట్లను అధిగమించి ప్రజలకు విస్తృత ప్రయోజనాలు అందించేందుకు వీలుగా దేశంలోనే మొట్టమొదటిసారి పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ‘్భ భారతి’ కార్యక్రమం దశాబ్ద కాలం గడిచినా ప్రయోగాత్మక దశకే పరిమితమం అవుతోంది. ఇక్కడి ఫలితాలను చూసి ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగిన సమయంలోనే రెండవ దశలో కరీంనగర్, శ్రీకాకుళం, నెల్లూరు, కడప, అనంతపూర్ జిల్లాలలో భూ భారతి కార్యక్రమం పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రయోగాత్మక దశ ఫలితాలే చేతికందని పరిస్థితి ఉండడంతో మలివిడత జిల్లాలలో భూభారతిని అటకెక్కించేశారని స్పష్టమవుతోంది. 2006 నవంబర్‌లో తొలి పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లాలో దీని అమలుకు శ్రీకారం చుట్టారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వ్యవసాయ క్షేత్రాలతో పాటు నివాసపు గృహాలు ఇతరాత్ర భూములకు సంబంధించిన పూర్తిస్థాయిలో రికార్డులను సేకరించి కంప్యూటర్లలో పొందుపర్చాలని భావించారు. ఇందుకోసం నేష్నల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్‌ఎ) ద్వారా భూములకు సంబంధించిన బ్లోమైడ్ మ్యాప్స్ తీయించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిచే సర్వేలు జరిపించారు. జిల్లాలోని మొత్తం 922 రెవెన్యూ గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూముల వివరాలను ఏరియల్ సర్వే ద్వారా గుర్తించారు. రైతులకు వారివారి భూముల వివరాలతో కూడిన మొత్తం 8.08 లక్షల మ్యాపులు తీయించి అందజేశారు. అభ్యంతరాలు ఉన్న రైతులకు సర్వే నోటీసులు అందజేసి, గ్రామ సభల ద్వారా రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని పరిష్కరించేందుకు కృషి చేశారు. ఈ క్రమంలో 5997 అభ్యంతరాలు రాగా, వాటిలో చాలావరకు పరిష్కరించామని అధికారులు పేర్కొన్నారు. తొలిదశలో కేవలం వ్యవసాయ భూములను మాత్రమే సర్వే చేయగా, ఇంకనూ నివాస గృహాలు, ఇళ్ల స్థలాల వివరాలను సేకరించాల్సి ఉంది. ఉపగ్రహ ఛాయాచిత్రాల రూపంలో సేకరించిన వివరాలను కంప్యూటర్ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసినట్లయితే, ప్రజలు తమ భూములకు సంబంధించిన వివరాలను కోరుకున్న వెంటనే ఏ ప్రాంతం నుండైనా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, స్థానిక సంస్థలను ఒకే తాటిపైకి తెస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం చేయవచ్చని భావించారు. ఇందుకోసం సంబంధిత శాఖల చట్టాలలో మార్పులు తెస్తూ, భూ యజమానులందరికీ టైటిల్ డీడ్‌లను అందజేసి, భూభారతి చట్టాన్ని అమల్లోకి తేవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ భూముల సర్వే ప్రక్రియ పూర్తయినప్పటికీ, ఆర్‌ఓఆర్ ప్రక్రియలను పూర్తి చేయడం తలకుమించిన భారంగా మారింది. ఇది పూర్తయిన మీదట, ప్రభుత్వం భూభారతి చట్టం రూపకల్పన చేస్తే తప్ప దీని ఫలాలు ప్రజలకు అందే అవకాశాలు కనిపించడం లేదు. వాస్తవానికి రెండేళ్ల కాల వ్యవధిలోనే అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకుని, ఫలితాలను అందిస్తామని ప్రభుత్వం మొదట్లో ఎంతో గొప్పగా ప్రకటించింది. అయితే నిజామాబాద్‌లో తొలిసారి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సవాలక్ష సమస్యలు చుట్టుముట్టడంతో ఇంకనూ వాటినే అధిగమించలేకపోతోంది. ప్రాజెక్టు అంచనా వ్యయం ఇప్పటికే దాదాపు ఐదింతలకు పైగా పెరిగినా, మ్యాపులను అందించే స్థితికి చేరుకోలేకపోయింది. ఇందుకు రెవెన్యూ రికార్డులు, భూముల సరిహద్దులపై అవగాహన ఉన్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది లేకపోవడం ఒక కారణంగా నిలుస్తుండగా, అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడం ఎడతెగని జాప్యానికి దారితీస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదివరకు ఉన్నతాధికారులు అడపాదడపా సమీక్షలు నిర్వహిస్తూ భూభారతి ప్రాజెక్టును తుదిదశకు చేర్చి ఫలితాలు అందించాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రస్తుతం అసలు భూభారతి ప్రాజెక్టు గురించి పట్టించుకుంటున్న దాఖలాలే కనిపించడం లేదు.

మత రిజర్వేషన్లు కల్పించడం తగదు
బడ్జెట్‌లో రాష్ట్రానికి పెద్దపీట
కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ

కామారెడ్డి, ఫిబ్రవరి 5: ముస్లింలకు మతం పేరుతో 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని బిజెపి వ్యతిరేకిస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం బిజెవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మతం పేరుతో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ప్రతిపక్ష నేతలు, టిఆర్‌ఎస్ నేతలు బిజెపిపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. ప్రధాని మోదీ హయాంలోనే దేశంలోని అన్ని వర్గాలకు ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మతం పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించినట్లయితే మిగిలిన మతాల వారు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ విషయంపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి, నాయకులు డాక్టర్ సిద్దిరాములు, మోతె క్రిష్ణాగౌడ్, నీలం రాజు, చింతల రమేశ్, జులూరి సుధాకర్, తదితరులున్నారు.

ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం
ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి

కంఠేశ్వర్, ఫిబ్రవరి 5: వడ్డెర కులస్థులు ఐక్యంగా ఉన్నప్పుడే వారి సమస్యలను పరిష్కరించుకోగల్గుతారని ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జిల్లా వడ్డెర ఐక్య సమితి ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏవిధంగానైతే ఐక్యంగా ఉండి పోరాటం చేశామో, అదే రీతిలో వడ్డెర కులస్థులు తమ హక్కుల సాధన కోసం ఏకతాటిపైకి చేరి పోరాడాలన్నారు. గతంలో ఎస్టీలుగా ఉన్న వడ్డెరలను బిసి(ఎ) కేటగిరీలోకి మార్చారని, దీంతో వడ్డెరలు వెనుకబడి పోయారని చెబుతున్నందున ఈ విషయమై ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు. వడ్డెరలు వెనుకబడి ఉండడానికి ప్రధానంగా చదువు, ఆర్థిక పరిస్థితులే కారణమని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వారివారి వృత్తులను వదిలిపోవడం కూడా కారణమని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే బిసి కమిషన్ ఏర్పాటు చేశారని, తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతూ సంఘం అధ్యక్షుడు బల్లెపు శంకర్ వినతిపత్రం అందించారని గుర్తు చేశారు. గ్రామాల్లో కుల వృత్తులు కాపాడుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వడ్డెరలు క్వారీల మీద హక్కులు అడుగుతున్నారని, వారి విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. వడ్డెర సంఘ భవన నిర్మాణానికి తన కోటా నిధుల నుండి 10లక్షల రూపాయలు అందజేస్తున్నట్టు ప్రకటించారు. అత్యంత వెనుకబడిన జాతిగా ఉన్న వడ్డెరలకు ఎల్లవేళలా తాను అండగా ఉంటానన్నారు. ఇకనైనా వడ్డెరలు తమ పిల్లలను చదివించి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని, రెసిడెన్సీ హాస్టళ్లు, బిసి స్టడీ సర్కిళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని, విదేశాల్లో చదువుకునేందుకు కూడా ప్రభుత్వం 20లక్షల రూపాయల వరకు ఆర్థిక తోడ్పాటును అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర ఐక్య సమితి జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు ఒల్లెపు శంకర్, ఉపాధ్యక్షుడు గిరి, పిట్ల శ్రీనివాస్, కోశాధికారి యాదగిరి, ప్రధాన కార్యదర్శి బత్తుల శంకర్, పెద్దులు, ఒడ్డె రవి, సుదర్శన్, రాష్ట్ర నాయకులు ఒల్లెపు మాగులు, పిట్ల శ్రీ్ధర్, మహిళా ప్రతినిధులు లక్ష్మి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నిజాంసాగర్ నీరు విడుదల
నిజాంసాగర్, ఫిబ్రవరి 5: నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా 3వ విడత నీరును ఆదివారం విడుదల చేశారు. ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా ఉన్న హెడ్‌స్లూయస్ జలవిద్యుత్ కేంద్రం గేట్ల ద్వారా 1350 క్యూసెక్‌ల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేసినట్లు ప్రాజెక్ట్‌డిఇఇ దత్తాత్రి తెలిపారు. ఆయకట్టు రైతులకు 3వ విడతగా సాగు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. నీటిని రైతులు వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రాజెక్ట్ ఆయకట్టుకింద లక్షా 15 వేల ఎకరాలలో రైతులు వరి పంటను సాగు చేసుకుంటున్నారన్నారు. ప్రతి నీటి బోట్టును వృథా చేయకుండా, డిస్ట్రీబ్యూటర్‌ల వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు, నీటిపారుదల శాఖా సిబ్బందితో కాపలా ఎర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా 1399.80 అడుగుల నీరు నిల్వ ఉండగా, 17.802 టిఎంసిలకుగాను 11.151 టిఎంసిల నీరు నిల్వఉందని డిఇఇ తెలిపారు.

వర్గీకరణ యత్నాలను విరమించుకోవాలి
మాల మహానాడు నాయకుల డిమాండ్
బాన్సువాడ, ఫిబ్రవరి 5: ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, వర్గీకరణ వల్ల దళితుల మధ్య ఐక్యత దెబ్బతింటుందని మాల మహానాడు బాన్సువాడ ఏరియా నాయకుడు నర్సింలు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అఖిలపక్షాన్ని తీసుకుని వర్గీకరణ కోసం ఢిల్లీకి వెళ్లేందుకు యోచిస్తున్నారని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. తెలంగాణలో దళితులు ఎంతో ఐక్యతతో ఉంటున్నారని, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు సైతం సత్ఫలితాలు అందిస్తున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్గీకరణ పేరుతో వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం భావ్యం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 29 లక్షల మాల కులస్థులు ఉన్నారని, వర్గీకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం ద్వారా వారి మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. ఈ ప్రయత్నాలను మానుకోని పక్షంలో ఆయా పార్టీల మద్దతును కూడగట్టి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు మైసయ్య, పర్వయ్య, ఎల్లప్ప, శ్రీకాంత్, దత్తు తదితరులు పాల్గొన్నారు.

మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
వినాయక్‌నగర్, ఫిబ్రవరి 5: మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు న్యాలం రాజు నేతృత్వంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆయా పథకాల కింద అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణకు నిధులు కేటాయిస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్ వాటిని సంబంధిత కార్యక్రమాల కోసం ఖర్చు చేయకుండా మతపరమైన రిజర్వేషన్ల గురించి ప్రకటిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెరాస ప్రభుత్వం చెబుతుండడం ఇది పూర్తిగా మతపరమైన రిజర్వేషన్ల కిందకే వస్తుందని అన్నారు. ఈ తరహా విధానాల వల్ల అన్ని వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నందున, రాజ్యాంగ విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బిజెవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు శ్రీకాంత్‌గౌడ్, రోషన్‌బొహ్రా తదితరులు పాల్గొన్నారు.

ఖాళీ ప్లేట్లతో హాస్టల్ విద్యార్థుల నిరసన
బాన్సువాడ, ఫిబ్రవరి 5: బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో సమీపంలో గల పోస్టుమెట్రిక్ బాలుర వసతి గృహానికి చెందిన విద్యార్థులు ఆదివారం ఖాళీ ప్లేట్లతో నిరసన తెలియజేశారు. ఉదయం తమకు అల్పాహారం అందించలేదని విద్యార్థులు ఈ నిరసనకు పూనుకున్నారు. వార్డెన్ సత్యం స్థానికంగా ఉండకపోవడంతో పాటు ప్రతిరోజు టిఫిన్, భోజనాలను తమకు సక్రమంగా అందించడం లేదని, కుళ్లిన కూరగాయలతో భోజనం వడ్డిస్తున్నారని, సిబ్బంది కూడా తమ బాగోగులను పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎబివిపి తదితర విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ వార్డెన్‌పై మండిపడ్డారు.