నిజామాబాద్

భక్త్భివం కలిగి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధారి, ఫిబ్రవరి 6: ప్రతి ఒక్కరూ భక్త్భివం కలిగి ఉండాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మాధవపల్లి, నేరల్ తాండాల్లో జరుగుతున్న ఆలయాల వార్షికోత్సవాలల్లో ఆయన సతీసమేతంగా పాల్గొని మహాదేవుని ఆలయంతో పాటు, నేరల్‌లోని హన్మాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువకులు ప్రతీ ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని సూచించారు. మహాదేవుని ఆలయం ఎన్నో మహిమలు కలదన్నారు. ఇక్కడికి రావడం ఆనందంగా ఉందని, ఈ ప్రాంతాన్ని రానున్న రోజుల్లో మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ఆలయాలను సందర్శించడం మూలంగా మనస్సుకు మానసిక ప్రశాతంత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహాదేవ్ స్వామి, టిఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శివాజీరావు, గాంధారి సొసైటి చైర్మెన్ ముకుంద్‌రావు, సదాశివనగర్ జడ్పీటిసి రాజేశ్వర్ రావు, పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కదంతొక్కిన గంగపుత్రులు
మోర్తాడ్, ఫిబ్రవరి 6: గంగపుత్రుల ఉపాధి అవకాశాలను దెబ్బతీసేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏర్గట్ల మండలానికి చెందిన ఆరు గ్రామాల మత్స్య కార్మిక సొసైటీల సభ్యులు, గంగపుత్రులు సోమవారం మోర్తాడ్‌కు చేరుకుని కదం తొక్కారు. తిమ్మాపూర్ క్రాస్ రోడ్ నుండి మోర్తాడ్ బస్టాండ్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై బైఠాయించి అరగంట పాటు రాస్తారోకో చేశారు. అక్కడి నుండి మళ్లీ ప్రదర్శనగా తహశీల్ కార్యాలయానికి వెళ్లి ధర్నా జరిపారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు తోకల నర్సయ్య మాట్లాడుతూ, ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గంగపుత్రుల జాబితాలో ఇతర కులస్థులను చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శోచనీయమన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు మరింతగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే గంగపుత్రులు దుర్భర జీవనాలు వెళ్లదీస్తున్నారని, చేపల పెంపకం, వాటి విక్రయాలపై తమకు ఉన్న హక్కులో ఇతర కులస్థులను కూడా భాగస్వామ్యం చేస్తే ఉపాధి మరింతగా క్షీణిస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ జీవోలను వెంటనే ఉపసంహరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో పాటుగా ప్రతి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సొసైటీలను ఏర్పాటు చేయాలని, సంఘ భవనాలు నిర్మించాలని, వయోఃవృద్ధులకు పెన్షన్లు కల్పించాలని, గంగపుత్ర విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం తహశీల్దార్ సూర్యప్రకాశ్‌కు మెమోరాండం అందజేశారు. ఈ ఆందోళనలో ఆరు గ్రామాల మత్స్య పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు, గంగపుత్రులు పాల్గొన్నారు.