నిజామాబాద్

ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఫిబ్రవరి 20: టిఆర్‌ఎస్ ఉద్యమనేత కెసిఆర్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీ మేరకు 12శాతం రిజర్వేషన్లును కల్పించి తీరుతామని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సోమవారం నగరంలోని లిమ్రా గార్డెన్‌లో మైనార్టీల ఆధ్వర్యంలో ఉల్-మా-హుఫాజ్ కార్యక్రమం నిర్వహించగా, ఎంపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో తెలంగాణలో ఎనలేని అభివృద్ధిని సాధించడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి రక్షిత మంచినీరు, మిషన్ కాకతీయ ద్వారా గుంటగుంటకు సాగునీటిని అందిస్తున్నామని అన్నారు. అర్హులైన పేదలందరికి ఆహార భద్రత పథకం కింద ఒక్కోక్కరికి 6కిలోల చొప్పున బియ్యం, ఆసరా పెన్షన్ల కింద 1000రూపాయల పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. ఇక ముస్లిం మైనార్టీల విషయానికి వస్తే, సిఎం కెసిఆర్ ఉర్దూ భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. సెక్యులరిజంకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోని అన్ని మతాల వారిని సమానంగా చూస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలోని ఒక్కో పోలీస్ స్టేషన్ అభివృద్ధికి 75వేల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇక డిప్యూటీ సిఎం పదవిని ముస్లిం నేతకు ఇచ్చిన విషయాన్ని ఎంపి కవిత గుర్తు చేశారు. అర్హులైన ముస్లిం మైనార్టీల ఆడబిడ్డలకు షాదీముబారక్ పథకం కింద పెళ్లి కోసం 51వేల రూపాయలను అందజేయడం జరుగుతుందన్నారు. 2016-17 బడ్జెట్‌లో మైనార్టీల సంక్షేమానికి 1200కోట్ల రూపాయల నిధులు కేటాయించి, ఇందులో ఇప్పటికే మైనార్టీల సంక్షేమం కోసం 900 కోట్లను ఖర్చు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రభుత్వం 8 మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో ఇప్పటికే విద్యార్థులను చేర్పించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఎంపి కవిత వెల్లడించారు. అదే విధంగా ముస్లిం పేద మైనార్టీలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యత కల్పిస్తానని ఎంపి కవిత హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఎంపి కవిత పిలుపునిచ్చారు. ఏదీ ఏమైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, నగర మేయర్ ఆకుల సుజాత, అలీం, ముస్లిం మత పెద్దలు ఆఫీజ్‌ఖాన్, హకీమ్ తదితరులు పాల్గొన్నారు.