నిజామాబాద్

అన్నివర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, సంక్షేమ ఫలాలను అన్ని వర్గాలకు సమానంగా అందించడలే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు సాగుతున్నారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నవీపేట మండలం జనే్నపల్లిలో 33/11కెసి సబ్‌స్టేషన్, ఎల్‌కె.్ఫరంలో అంబేద్కర్ విగ్రహం, నవీపేట డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం, అబ్బాపూర్(ఎం)లో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులకు ఎంపి కవిత సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపి మాట్లాడుతూ, గత 60సంవత్సరాల నుండి ఆంధ్రోళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని అన్నారు. తెలంగాణ ప్రజల సాధక, బాధలు తెలిసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని, అందుకే 200రూపాయలు ఉన్న పెన్షన్‌ను 1000, 1500రూపాయలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల మందికి ప్రభుత్వం వివిధ రకాల పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30వేల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని, అదే విధంగా 3000వేల పరిశ్రమలను స్థాపించడం వల్ల వేలాదిమంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేజీ టూ పీజీ విద్య అమలులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ గురుకుల పాఠశాలలను మంజూరీ చేయడం జరిగిందని, వచ్చే సంవత్సరం నుండి పూర్తి సౌకర్యాలతో వీటిని నిర్వహించడం జరుగుతుందని ఎంపి వెల్లడించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులతో పాటు సన్నబియ్యంతో భోజనాన్ని అందిస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇటీవల ఇంటికో పెన్షన్ మాత్రమే ఉండేదని, వచ్చే ఏప్రిల్ నుండి ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందికి పెన్షన్లు మంజూరీ చేయడం జరుగుతుందని ఎంపి కవిత స్పష్టం చేశారు.
అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పిట్టగూడులాంటి ఇళ్లను నిర్మించినట్లు కాకుండా, రెండు బెడ్‌రూమ్‌లు, ఒక హాల్, కిచెన్‌తో కూడిన ఇంటిని నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 6,29,000రూపాయలు వెచ్చించి, అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
అంబేద్కర్ చూపిన మార్గంలోనే తెలంగాణ సాధించాం
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఇచ్చిన ధైర్యం, ఆయన చూపిన మార్గంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని ఎంపి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం నవీపేట మండలం ఎల్‌కె.్ఫరంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ, నాటి సమైక్య రాష్ట్రంలో మొత్తం 10కోట్ల మంది ప్రజలు ఉండగా, అందులో 7కోట్లు ఆంధ్రులు, 3కేవలం 3కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉండేవారన్నారు. పైగా అధికారం కూడా సమైక్యాంధ్రుల చేతిలో ఉన్నప్పటికీ, చిన్న రాష్ట్రాలతోనే సత్వర అభివృద్ధి సాధ్యమన్న అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగిందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 3(ఎ) ప్రకారం తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం కల సిద్ధించిందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఎంపి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ శాసన సభ్యుడు షకీల్ అమేర్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, వైస్ చైర్మన్ గడ్డం సుమనారెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లం, ఎంపిపి రాజేంద్రకుమార్‌గౌడ్, జడ్పీటిసి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.