మెదక్

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి 2692 మంది రైతులు అప్పుల బాదతో ఆత్మహత్యలు చేసుకోగా, వారికి పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం వివిద సాకులు చెపుతోందని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి స్పష్టం చేశారు. సోమవారం నియోజకవర్గ పరిదిలోని 40 బాదిత కుటుంబాలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ విజేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జీఓ నంబర్ 194ను వర్తింపజేసి రూ. 5లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆత్మహత్యను గుర్తించేందుకు ఎఫ్‌ఐఆర్, ఫైనల్ రిపోర్టును ప్రాతిపదికగా గుర్తించాలని, బాధిత కుటుంబాలకు ప్రైవేటు అప్పుల నుండి రుణ విముక్తి చేయడంతోపాటు బ్యాంకులలోని అప్పులను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. బాధిత కుటుంబాలకు అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, ప్రతి 5 గ్రామాలకు ఒక రైతు సహాయక కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వ శాఖల నుండి రావాల్సిన మద్దతును ఒకే చోట అందేలా చూడాలని, రైతుల్లో బరోసా ఇచ్చి ఆత్మహత్యలు నివారించాలని, కౌలు రైతులను దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థికంగా చేయూతనిస్తూ పంటల బీమా పథకం వర్తింపజేయాలని, ఉపాది హామీ పథకాన్ని వర్తింపజేస్తూ 100 రోజుల పనిని రాష్ట్ర వ్యాప్తంగా కల్పించి అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు.

విద్యతోనే మంచి భవిష్యత్తు
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలికి తీయాలి
సాక్షరభారత్ జిల్లా డైరెక్టర్ గోపాల్‌రెడ్డి
గజ్వేల్, ఫిబ్రవరి 20: విద్యతోనే చక్కటి భవిష్యత్తు ఉంటుందని సాక్షరబారత్ జిల్లా డైరెక్టర్ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్‌లో జిఎంఆర్ యాజమాన్యం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గురువులు వెలికి తీసి సమాజానికి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులే చక్కటి ప్రతిభ కనబరుస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుండగా, అంది వచ్చిన అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే విద్యతోపాటు క్రీడలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రస్థుత పోటీ ప్రపంచంలో ప్రతిభ కలవారిదే పైచేయి అవుతుందని పేర్కొన్నారు. కాగా గత 23 సంవత్సరాలుగా జిఎంఆర్ యాజమాన్యం ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందజేయగా, రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబర్చి గజ్వేల్‌కు మంచి పేరు తెచ్చినట్లు తెలిపారు. అనంతరం వివిద రంగాలలో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేయగా, నిర్వహించిన సంస్కృతిక సంబరాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగాయి.