నిజామాబాద్

అద్దెబోర్లకు డబ్బులు చెల్లించలేదని అధికారులపై సర్పంచ్‌లు, సభ్యుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమ్మర్‌పల్లి, ఫిబ్రవరి 21: గత సంవత్సరం వేసవిలో నీటి సౌకర్యం లేని గ్రామాల్లో ప్రజల దాహార్తి సమస్యను తీర్చేందుకు రైతుల నుండి బోర్లను అద్దె ప్రాతిపదికన తీసుకుని నీటిని సరఫరా చేశామని, సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు అందుకు సంబంధించిన డబ్బులు చెల్లించలేదని పలు గ్రామాల చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కమ్మర్‌పల్లి ఎంపిపి మాలావత్ కౌసల్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన వెంటనే హాసాకొత్తూర్ ఎంపిటిసి సభ్యుడు తెడ్డు రాజన్న మాట్లాడుతూ, గత వేసవిలో కమ్మర్‌పల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అద్దె ప్రాతిపదికన రైతుల బోర్లను తీసుకుని నీటిని సరఫరా చేయడం జరిగిందన్నారు. వాటికి సంబంధించిన డబ్బులు ఇంత వరకు చెల్లించలేదని, అధికారులు ఇలా వ్యవహరిస్తే గ్రామాల్లో ప్రజాప్రతినిధుల మాటలు ఎవరు వింటారని ఆయన ప్రశ్నించారు. ఇందుకు ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ అమీర్‌ఖాన్ సమాదానం ఇస్తూ, సాంకేతిక కారణాల వల్ల కొన్ని బ్యాంకుల్లో డబ్బులు జమ చేయలేకపోయామని, వారం రోజుల్లో డబ్బులు రాని అద్దెబోర్ల రైతులకు చెక్కులను అందజేస్తామన్నారు. కమ్మర్‌పల్లి మండలంలో మిషన్ భగీరథ పనుల కోసం 9కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఎఇ అమీర్‌ఖాన్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ, గత సంవత్సరం కరవు మూలంగా ఎండిపోయిన పంటలపై అంచనాలు తయారు చేసి, ప్రభుత్వానికి 3.11కోట్ల ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. ఇందుకు గాను కోటీ 11లక్షలు వచ్చాయని, ఆ డబ్బులను వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. మిగతా రెండు కోట్ల రూపాయలు త్వరలో మంజూరు అవుతాయని అన్నారు. కమ్మర్‌పల్లి మండలంలో ప్రతి 5వేల ఎకరాలకు ఒక ఎఇఓను నియమించడం జరిగిందని, గ్రామాల్లో ప్రతి రైతు వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చుతున్నామని ఆయన తెలిపారు. కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలోని సబ్ స్టేషన్ పనులు నెల రోజుల్లో పూర్తి కానున్నాయని విద్యుత్ శాఖ అధికారి సభ దృష్టికి తెచ్చారు. మండలంలోని కుర్మ, యాదవులకు సబ్సిడీపై గొర్రెలను అందించనున్నట్లు పశువైద్యాధికారి వెల్లడించారు. 1,32,500 రూపాయల యూనిట్ ధరకు గాను లబ్ధిదారుడు 32,500 రూపాయలు చెల్లిస్తే, ప్రభుత్వం లక్ష రూపాయలు సబ్సిడీ అందిస్తుందన్నారు. ఈ డబ్బులతో 20ఆడ గొర్రెలు, ఒక మగ గొర్రెపోతును అందించడం జరుగుతుందన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రతి గ్రామానికి 25 యూనిట్ల వరకు అందజేయడం జరుగుతుందన్నారు. కమ్మర్‌పల్లి తహశీల్దార్ అర్చన మాట్లాడుతూ, త్వరలో అర్హులైన లబ్ధిదారులకు తెలంగాణ లోగోతో కూడిన ఆహార భద్రత కార్డులను అందజేస్తామని అన్నారు. కమ్మర్‌పల్లి మండలంలో సాదాబైనామాల దరఖాస్తులు 6,394 వచ్చాయని, వీరిలో అర్హులైన వారికి త్వరలో పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జడ్పీటిసి సభ్యురాలు దాసరి లక్ష్మి, కమ్మర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దొన్కంటి నర్సయ్య, ఎంపిడిఓ చంద్రశేఖర్‌శర్మ, ఇఓపిఆర్‌డి రాజేశ్వర్‌తో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నిరుద్యోగ నిరసన ర్యాలీకి అనుమతివ్వాలని
పిడిఎస్‌యు రాస్తారోకో

కంఠేశ్వర్, ఫిబ్రవరి 21: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టి.జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో రాస్తారోకో చేపట్టారు. పిడిఎస్‌యు రాష్ట్ర నాయకుడు అనే్వష్ నేతృత్వంలో నగరంలోని కంఠేశ్వర్ నుండి ధర్నాచౌక్ వరకు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు నగర అధ్యక్షురాలు సౌందర్య మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలే ప్రధానంగా భావించి విద్యార్థులు పాల్గొనడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. తెలంగాణ వస్తే సంవత్సరానికి లక్ష ఉద్యోగాలతో పాటు ఇంటికో ఉద్యోగం వస్తుందన్న హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. నిరుద్యోగుల పట్ల సిఎం కెసిఆర్ అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ టి.జెఎసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 22న నిరసన ర్యాలీ చేపడితే, అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేయడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి, నిరుద్యోగుల నిరసన ర్యాలీకి అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి సరిత, మహేందర్, ప్రవీణ్, ధరణి తదితరులు పాల్గొన్నారు.