నిజామాబాద్

కుర్మ, గొల్ల యాదవ కుటుంబాలను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 21:కెసిఆర్ సర్కార్ రాష్ట్రంలోని 4 లక్షల కుర్మ, గొల్లయాదవ కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి 75 శాతం సబ్సిడీపై ఒక్కో యూనిట్‌ను 20 గొర్రెలు, 1పోటేలు అందజేస్తుందని, స్థానిక ఎమ్మెల్యే ఏనుగురవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణంలో జరిగిన ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల కుర్మ,గొల్ల యాదవుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర సిఎం కుర్మ,గొల్ల యాదవ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు, లక్షా 20 వేల రూపాయలతో, 75శాతం సబ్సిడీపై ఒక్కో కుటుంబానికి 20 గొర్రెలు, 1 పొటేలును అందజేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు వీరిని విస్మరించాయని అన్నారు. ఒక్కోయూనిట్‌కు లక్షా 20 వేల రూపాయలు సరిపోవని, ఈమొత్తాన్ని పెంచేందుకు కాబినెట్ సబ్‌కమిటీలో సిఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. కుర్మ, గొల్ల యాదవుల్లో 25 శాతం సబ్సిడీ కూడా చెల్లించలేని కుటుంబాలకు సొసైటీల ద్వారా రుణాలు ఇప్పించి వంద శాతం సబ్సిడీ కింద గొర్రెల యూనిట్‌లను ఇప్పించేందుకు కృషి చేస్తాన్నారు. కుర్మగోల్లయాదవుల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు, కమిటీలు వేసుకుని, వారిలోముందుగా నిరుపేద కుటుంబాలకు ఎంపిక చేయాలని సూచించారు. ఎంపిక చేసిన లబ్దిదారులకు రెండు విడతలుగా యూనిట్‌లను అందజేయడం జరుగుతోందన్నారు. ఎంపికైన కుటుంబాలు నాణ్యమైన గొర్రెలను కొనుగోలు చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేయాలన్నారు. అవసరమైతే స్వయంగా మీతోవచ్చి గొర్రెలు కొనుగోలు చేయిస్తానన్నారు. ఎన్నికల సమయంలోఇచ్చిన హామిలన్నింటిని సిఎం కెసిఆర్ ఒక్కక్కటిగా నెరవేరుస్తున్నారన్నారు. ఇవ్వని హామిలను సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందజేసేలా చర్యలుతీసుకుంటున్నారన్నారు. ఆసరాపింఛన్, వసతి గృహాల విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు సన్నబియ్యంతోఅన్నం అందించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. గత కాంగ్రెస్ 40 ఏళ్ల పాలనలోరైతులు కరెంట్ కష్టాలు ఎదుర్కొన్నారన్నారు. కాని నేడు సిఎం కెసిఆర్ సర్కార్, నిరంతరంగా 24 గంటల పాటు గృహావసరాలకు నాణ్యమైన విద్యుత్, వ్యవసాయానికి పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకున్నారన్నారు. సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల ఎంపిపిలు నక్కగంగాధర్, ఊషమ్మ సంజీవులు, జడ్పీటిసి సభ్యులు చినబాలి సామెల్, కాశీనారాయణ, ఎఎంసి చైర్మైన్ మారెడ్డి వెంకట్‌రాంరెడ్డి, సింగల్‌విండో చైర్మన్ బోండ్ల సాయులు, వైస్‌ఎంపిపి నునుగొండ శ్రీనివాస్, స్థానిక ఇంచార్జి సర్పంచ్ పప్పువెంకటేశం, ఎంపిటిసి సభ్యులు రాజశేఖర్, మండల కో-ఆఫ్షన్ సభ్యులు రఫీక్, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రవణ్‌కుమార్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, కుర్మయాదవ జిల్లాఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లేష్‌యాదవ్, మండల అధ్యక్షులు సాయులు, కుర్మపాపయ్య, కుర్మదుర్గవ్వ, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు గొర్రెపిల్ల బహూకరణ
కుర్మ, గొల్లయాదవ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి, కుర్మయాదవ జిల్లాఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లేష్ యాదవ్, కుర్మసాయులు, కుర్మదుర్గవ్వ, కుర్మపాపయ్యలు, ఎమ్మెల్యేకు కుర్మకులస్థుల సంప్రదాయ గొంగలి, తలపాగతోపాటు గొర్రెపిల్లను బహూకరించారు.