నిజామాబాద్

డిబిఆర్ నిర్మాణాలకు స్థల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఫిబ్రవరి 21: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా నిజామాబాద్ నగరంలో అర్హులైన పేదలకు ఇళ్లు కట్టించేందుకు అవసరమైన స్థలాన్ని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, కలెక్టర్ డాక్టర్ యోగితారాణాలు మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 500చొప్పున ఇళ్లును మంజూరు చేయగా, జిల్లా ఎంపి కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాల కృషితో సిఎం కెసిఆర్ అదనంగా మరో 1000 ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇందులో 400 ఇళ్ల నిర్మాణాలకు గాను ఇప్పటికే టెండర్లను ఖరారు చేయడం జరిగిందని, మిగతా 1100 ఇళ్లకు త్వరలో ఆసక్తిగల కాంట్రాక్టర్ల నుండి టెండర్లు ఆహ్వానించి, పక్షం రోజుల్లో పనులు ప్రాభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అదనంగా మంజూరు చేసిన 1000 ఇళ్లకు అవసరమైన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, పూర్తి సర్వే చేసి ప్రభుత్వానికి పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా నగరానికి మంజూరైన ఉమెన్స్ డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాలల వసతి గృహాలకు అవసరమైన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వీరి వెంట జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత, డిఆర్‌ఓ పద్మాకర్, తహశీల్దార్ సుదర్శన్, ఇఇ హన్మంత్‌రావు తదితరులు ఉన్నారు.

నెల రోజుల్లో పెద్దపల్లి-నిజామాబాద్ రైలు ప్రారంభం
సౌత్ సెంట్రర్ డిఆర్‌ఎం అరుణాసింగ్

కంఠేశ్వర్, ఫిబ్రవరి 21: దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇచ్చే నివేదిక ఆధారంగా నెల రోజుల్లో పెద్దపల్లి-నిజామాబాద్ పుష్‌పుల్ రైలును ప్రారంభిస్తామని డిఆర్‌ఎం అరుణాసింగ్ పేర్కొన్నారు. మంగళవారం ఆమె నిజామాబాద్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అరుణాసింగ్ మాట్లాడుతూ, పెద్దపల్లి నుండి నిజామాబాద్ వరకు చేపట్టిన రైల్వేలైన్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఈ మేరకు రెండు రోజుల క్రితం రైల్వే సేఫ్టీ బృందం సైతం ఈ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. సేఫ్టీ కమిషనర్ ఇచ్చే నివేదిక ఆధారంగా నెల రోజుల వ్యవధిలో ప్రస్తుతం మోర్తాడ్ వరకు నడుస్తున్న పుష్‌పుల్ రైలును నిజామాబాద్ వరకు పొడిగిస్తామని వెల్లడించారు. అంతకు డిఆర్‌ఎం అరుణాసింగ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లోని సిగ్నల్ క్యాబిన్‌తో పాటు మరికొన్ని విభాగాలను ఆమె పరిశీలించారు. డిఆర్‌ఎం అరుణాసింగ్ వెంట డిఎస్‌ఓ రవికుమార్, డిసిఎం క్రిష్ట్ఫర్, డిఎన్ కోఆర్డినేటర్ రాజీవ్, స్టేషన్ మేనేజర్ సయ్యద్ జావీద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.