నిజామాబాద్

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివనగర్, ఫిబ్రవరి 24: అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధిహామీ సిబ్బంది వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంటుందన్నారు. మర్కల్ ఎంపిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఎంపిడిఓ చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ, ఎంపిటిసి ఎన్నికల కోసం 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, రెండు మర్కల్ గ్రామంలో, 1 తిర్మన్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన హరితహారం మొక్కలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాధర్, సూపరిండెంట్ బాలక్రిష్ణ, సినియర్ అసిస్టెంట్ సూర్యాజీరావు, టిఎలు రవీందర్, రాజు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
ఎమ్మెల్యే హన్మంత్‌షిండే
బిచ్కుంద, ఫిబ్రవరి 24: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. శుక్రవారం ఆయన తన స్వగృహంలో మైనార్టీ గురుకుల పాఠశాల పోస్టర్ల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిచ్కుంద మండల కేంద్రానికి మైనార్టీ గురుకుల పాఠశాల మంజూరైందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. మైనార్టీల ఆడపిల్లల కల్యాణం కోసం షాదీముబారక్ పథకం కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. సిఎం కెసిఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు అసత్‌అలీ, నాయకులు లడ్డుమియా, బాల్‌రాజు, జడ్పీటిసి సాయిరాం, వెంకట్‌రావు పాల్గొన్నారు.