నిజామాబాద్

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఫిబ్రవరి 28: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటీష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం తన ఛాంబర్‌లో రోడ్డు భద్రతపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేందుకు గాను అక్సిడెంట్ రిజల్యూషన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్, తహశీల్దర్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి ఎఇలు, ఎంవిఐ, సంబంధిత ఏరియా ఆర్టీసీ డిపో మేనేజర్, స్థానిక సర్పంచ్ సభ్యులుగా ఉంటారని అన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ఈ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతంలో ప్రమాదం జరగడానికి కారణాలను పరిశీలించి, 72గంటల్లో తనకు నివేదిక అందజేయాలన్నారు. నిజామాబాద్-బోధన్ రహదారిపై 43స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని, దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్టీసీ ఆర్‌ఎం ఖుస్రోషాహఖాన్ కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ స్వీడ్ బ్రేకర్లను తొలగించుటకు శాస్ర్తియ పద్దతిలో ఎన్ని అవసరం అవుతాయి, ఏయే ప్రాంతంలో వాటిని ఏర్పాటు చేయాలో పరిశీలించి నివేదిక అందించాలని ఆర్ అండ్ బి ఎస్‌ఇ మధుసుదన్‌ను ఆదేశించారు. రాష్ట్ర రహదారులపై, జాతీయ రహదారులపై ప్రమాదాలు జరుగకుండా పటీష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో 63కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు, 43కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నందున, ఈ పరిధిలో ప్రమాదాలు జరుగకుండా చూడాలన్నారు. పట్టణాల్లో ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు వాహనచోధకులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకునే విధంగా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని నెహ్రూపార్క్ నుండి జానకంపేట్ వరకు రోడ్డు చాలా ఇరుకుగా ఉన్నందున ఆయా కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఎసిపి, ఆర్డీఓలకు సూచించారు. రాత్రి సమయంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసు శాఖ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలన్నారు. రోడ్డు వెడల్పు చేపట్టేందుకు టెండర్ ప్రక్రియ పూర్తయినందున పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు సహకారం అందిస్తే, రోడ్డు పనులు చేపడ్తామని ఆర్ అండ్ బి ఎస్‌ఇ మధుసుదన్ కలెక్టర్‌కు నివేదించారు. పోలీసు కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ, గత సంవత్సరం కంటే ఈసారి ప్రమాద సంఘటనలు తక్కువగా ఉన్నాయని, మరణాల సంఖ్య కూడా చాలా తగ్గిందన్నారు. ఈ సమావేశంలో బోధన్ సబ్ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆర్టీసీ ఆర్‌ఎం ఖుస్రోషాహాఖాన్, ఎసిపిలు ఆనంద్‌కుమార్, వెంకటేశ్వర్లు, డిఎంహెచ్‌ఓ వెంకట్, ఆర్టీఓ తదితరులు పాల్గొన్నారు.