నిజామాబాద్

ఎర్రజొన్న సమస్యను పరిష్కరించకుండా విమర్శించడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, మార్చి 2: దీర్ఘకాలికంగా ఆర్మూర్ ప్రాంత రైతాంగం ఎదుర్కొంటున్న ఎర్రజొన్నల సమస్యను పరిష్కరించకుండా కొంతమంది మధ్య దళారీలతో విమర్శలు చేయించడం విడ్డూరంగా ఉందని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ అన్నారు. గురువారం ఆర్మూర్‌లోని రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడితే అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని అన్నారు. ఇలాంటి సందర్భంలో మధ్యదళారీలు మాజీ స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డిని లక్ష్యం చేసుకొని విమర్శలకు దిగడం అర్థరహితమని అన్నారు. రైతాంగ సమావేశాన్ని మార్కెట్ కమిటీలో పెట్టుకుంటామంటే అంగీకరించని పాలకవర్గం మధ్య దళారీలైన విత్తన వ్యాపారుల సమావేశానికి ఎలా అనుమతి ఇచ్చారని చెప్పారు. ఆర్మూర్ ఎమ్మెల్యేతో పాటు పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇప్పటికైనా స్పందించి ఎర్రజొన్న సమస్యను సిఎం దృష్టికి తీసుకెళ్లి మద్దతు ధర ఇప్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2008లో సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అప్పటి స్పీకర్ సురేష్‌రెడ్డి ఒప్పించి 36 కోట్ల రూపాయలను ఇప్పించారని ఆయన గుర్తు చేశారు. సమగ్ర విత్తన చట్టం తేవాలని అప్పట్లోనే సురేష్‌రెడ్డి ప్రస్తావించారని అన్నారు. చాలా మంది విత్తన వ్యాపారులు ఆర్థిక స్థోమత లేకున్నా ఎర్రజొన్నలను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా చేతులు ఎత్తేస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డిపై అసత్యపు ఆరోపణలు మానుకోకుంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ కమీషన్ల కోసం దళారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో ఇసుక గురించి మాట్లాడిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎర్రజొన్న సమస్యను మాత్రం ప్రస్తావించలేదని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పిసి బోజన్న, యాల్ల సాయారెడ్డి, గంగామోహన్ చకృ, జీవన్, మహమూద్‌అలీ, నర్మే నవీన్, మోయిన్, పాన్‌శ్రీను, నవీన్‌రెడ్డి, విజయ్, విఠోబ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై దాడులను అరికట్టాలి
వినాయక్‌నగర్, మార్చి 2: కేరళ రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై, హిందూ సంస్థలపై కమ్యూనిస్టులు జరుపుతున్న దాడులను అరికట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర ప్రచారక్ పి.శ్యాంకుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద గురువారం ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంకుమార్ మాట్లాడుతూ, కేరళలో హిందూ సంస్థలపై, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై మార్క్సిస్టులు గత ఎంతోకాలం నుండి దాడుల పరంపరను కొనసాగిస్తున్నారని, ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దాడులు మరింతగా పెచ్చుమీరిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పది మంది వరకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కార్యకర్తలు ఈ దాడుల్లో తమ ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వెలిబుచ్చారు. పోలీసుల పక్షపాత ధోరణి వల్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతోందన్నారు. కేరళలో కొనసాగుతున్న ఈ దాడులను నిరోధించి, శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఈ తరహా దాడులు కొనసాగుతుండడం శోచనీయమని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ ఖండించారు. ఈ ధర్నాలో ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంఘ్ చాలక్ జనగాం నరేందర్, బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, ముక్కా దేవేందర్‌గుప్తా, డాక్టర్ డిఎల్‌ఎన్.స్వామి తదితరులు పాల్గొన్నారు.