నిజామాబాద్

హిందూ నాయకులపై దాడి అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మార్చి 3: కేరళ రాష్ట్రంలో హిందూ నాయకులపై చేస్తున్న దాడులు అమానుషంగా ఉన్నాయని ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రముఖ్ రాంమూర్తి అన్నారు. శుక్రవారం హిందూ నాయకులపై దాడులకు నిరసనగా జాగృత భారత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమంలో రాంమూర్తి మాట్లాడుతూ, కేరళ రాష్ట్రంలో హిందూ నాయకులు, ప్రజలపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. భారతదేశంపై, భారతీయులపై అభిమానం ఉన్న వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడారని, కేవలం దేశ ద్రోహులే ఈ పనులు చేస్తారని అన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేరళ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, కమ్యూనిస్టులు ఉద్ధేశ పూర్వకంగానే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పార్టీలకు ప్రజలకు బుద్ధి చెబుతారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆందోళన కారులు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్‌గౌడ్, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్, ఎబివిపి, నేతలు మోతే కృష్ణగౌడ్, రంజిత్‌మోహన్, మల్లేశ్‌యాదవ్, జి.సుధాకర్, పుల్లూరి సతీష్, ప్రభాకర్‌యాదవ్, చింతల రమేష్, తేలు శ్రీనివాస్, బాలమణి, సబిత, రాజు, శంకర్, శ్రీనివాస్‌లతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు అయ్యారు.

చివరి ఆయకట్టును సందర్శించిన మంత్రి పోచారం
*అడుగడుగునా కనిపించిన కరెంటు మోటార్లు
*కేసులు నమోదు చేయాలని ఆదేశాలు

బోధన్ రూరల్, మార్చి 3:నిజాంసాగర్ చివరి ఆయకట్టు పంట పొలాలకు సాగర్ నీళ్లు అందడం లేదని రైతులు ఆందోళనలు చేస్తుండటాన్ని సీరియస్‌గా పరిగణించిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం చివరి ఆయకట్టు గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు. అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కెనాల్ వెంట ప్రయాణం చేసి కాలువలలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. నిజాంసాగర్ ప్రధాన కాలువ నుండి కోటగిరి మండలం సులేమాన్ ఫారం మీదుగా బోధన్ మండలం సాలూరా క్యాంప్, జాడి, పత్తేపూర్, పెంటాకుర్దు, ఆచన్‌పల్లి గ్రామాల వద్ద గల సాగర్ కాలువలను పరిశీలించారు. అలాగే మంజీరా పరివాహక గ్రామమైన పత్తేపూర్ వద్ద రైతుల పంటపొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు. సాలూరా సహకార సంఘం అధ్యక్షుడు బుద్దె రాజేశ్వర్ పరివాహక గ్రామాల వద్ద నెలకొన్న వాస్తవ పరిస్థితులను మంత్రికి తెలియచేశారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడుతూ తమ సర్కారు రైతాంగ సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. చివరి ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో సాగర్ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగానే స్వయాన తాను నాలుగు రోజుల నుండి పర్యటిస్తున్నట్లు వివరించారు. రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలు ఏ మాత్రం సహించేది లేదన్నారు. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో గుర్తించి తక్షణమే నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించామన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, తప్పుడు మాటలు నమ్మవద్దని సూచించారు. కాలువల వెంట కొన్ని చోట్ల కరెంటు మోటార్లు ఉన్నట్లు తెలిసిందని అటువంటివి ఇక ముందు పెట్టినట్లు తెలిస్తే కేసులు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఎగువ భాగంలో కరెంటు మోటార్లు బిగించడం వలన క్రిందిబాగానికి నీళ్లు సకాలంలో రాలేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేసేందుకు తమ సర్కారు సిద్ధంగా ఉందన్నారు. ప్రతి పంటను కాపాడటమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్నారు. మంత్రి వెంట సాలూరా సహకార సంఘం చైర్మన్ బుద్దె రాజేశ్వర్, షకీల్, సుందర్‌రాజ్, సత్యనారాయణరెడ్డి, డిస్కో సాయిలు, రాచప్ప తదితరులు ఉన్నారు.