నిజామాబాద్

రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మార్చి 6: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధితో పాటు వౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామానికి 10లక్షలు, దేవునిపల్లికి 10, చిన్నమల్లారెడ్డికి 10, అడ్లూర్ 7.5 లక్షలు, టేక్రియాల్ 7.5లక్షలు, లింగాపూర్‌కు 5లక్షలు, క్యాసంపల్లి 7.5 లక్షలు, రామేశ్వర్‌పల్లి 5 లక్షలు, ఇస్రోజివాడి 2.5లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. మాచారెడ్డి మండలంలో పల్వంచ గ్రామానికి 5లక్షలు, చుక్కాపూర్‌కు 5లక్షలు, లక్ష్మీదేవునిపల్లికి 5లక్షలు, రెడ్డిపేట్‌కు 5లక్షలు, రత్నగిరిపల్లి 5లక్షలు, సింగారాయపల్లికి 5లక్షలు, పరిధీపేట్‌కు 5లక్షలు, మంథెని దేవునిపల్లికి 5లక్షలు, ఇసాయిపేట్‌కు 5లక్షలు, పోతారం 12.50 లక్షలు, ఎల్లంపేట్ 2.50లక్షలు, ఎల్పుగొండ 5లక్షలు, భవానిపేట్‌కు 10 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. దోమకొండ మండలంలోని యడారం గ్రామానికి 8 లక్షలు, ఇస్సానగర్ 8లక్షలు, తుజాల్‌పూర్‌కు 3లక్షలు, అంచనూరుకు 3లక్షలతో పాటు మరిన్ని గ్రామాలకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. భిక్కనూరు మండలంలోని ఆయా గ్రామాలకు కూడా నిధులు మంజూరైనట్లు తెలిపారు. మొత్తం 71గ్రామాలకు గాను 3 కోట్ల 30 లక్షలు నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జడ్పీటిసి సభ్యులు నంద రమేశ్, మదుసుధన్‌రావు, మండల పార్టీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మారెడ్డి, జకుంటి మోహన్‌రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యులు గోపిగౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ బల్వంత్‌రావు, నాయకులు జుకంటి ప్రభాకర్‌రెడ్డి, భూమేశ్‌యాదవ్, తదితరులున్నారు.

తిమ్మాపూర్ పోచమ్మ ఆలయంలో నాగేంద్రుడు
మోర్తాడ్, మార్చి 6: నిత్యం కొలిచే పోచమ్మతల్లి ఆలయంలో నాగేంద్రుడు మూడు రోజులుగా నివాసం ఉంటుండడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లోని కమ్మర్‌పల్లి రోడ్డులో గల పోచమ్మ ఆలయంలో మూడు రోజులుగా నాగుపాము తిరుగుతోంది. సుమారు ఆరడుగుల పొడువు ఉన్న ఈ సర్పం అమ్మవారి మూలవిరాట్టు వద్ద పడగ విప్పి దర్శనం ఇస్తోంది. మొదట్లో అటవీ ప్రాంతం కావడంతో ఈ సర్పం వచ్చి పోతుందని అనుకున్నప్పటికీ, గడిచిన మూడు రోజుల నుండి ఆలయంలోనే ఉంటూ అక్కడే తిరుగుతోంది. విషయం కాస్త ప్రచారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి నాగుపామును, అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు.
వైభవంగా శ్రీనివాస గోదాదేవి కల్యాణం

బీర్కూర్, మార్చి 6: తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో కొండలపై ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం రెండవ వార్షికోత్సవం సోమవారం అంగరంగవైభవంగా జరిగింది. ఉదయానే్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు వేంకటేశ్వరస్వామి, గోదాదేవి కల్యాణం సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించారు. దేవనాథ రామనుజాజియార్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న కల్యాణమహోత్సవం కార్యక్రమంలో మంగళసూత్రం, బంగారు గాజులను మంత్రి దంపతులు అందచేసి వేంకటేశ్వరస్వామి, గోదాదేవిలను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని మంత్రి దంపతులతో పాటు మంత్రి సోదరుడు శంబురెడ్డి దంపతులు కలిసి బ్రహ్మణోత్తములు వేదమంత్రాలు పటిస్తుండగా కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం ఆవరణలో అంతకు ముందు యజ్ఞం, ధ్వజరోహణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కల్యాణమహోత్సవానికి జిల్లాలోని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, కామారెడ్డి జిల్లా ఎస్పీ శే్వతా, జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్‌రాజు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా మంత్రి కుమారులైన పోచారం రవీందర్‌రెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డి, బాస్కర్‌రెడ్డి ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి జంటలుగా వచ్చి స్వామి వారికి పూజ కార్యక్రమాలతో పాటు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వార్షికోత్సవంలో బాన్స్‌వాడ ఆర్డీఓ రాజేశ్వర్, తహశీల్దార్ కిష్టనాయక్, ఎండిఓ భారత్‌కుమార్, ఎస్‌ఐ.రాజ్‌భరత్‌రెడ్డి, ఎఎమ్‌సి చైర్మన్ పెరిక శ్రీనివాస్, మాజీ జడ్పీటిసి సతీష్, ఆలయ కమిటీ సభ్యులు అశోక్, అప్పరావు, నాగేశ్వర్‌రావు, సత్యనారాయణ, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, అధిక సంఖ్యలో రెండు జిల్లాల భక్తులు పాల్గొన్నారు.