నిజామాబాద్

పంచాయతీ కార్మికుల దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్ రూరల్, మార్చి 6: బోధన్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం పంచాయతీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు మొదలు పెట్టారు. తమకు ప్రభుత్వ గ్రాంట్స్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు ఈ నిరవధిక దీక్షలకు శ్రీకారం చుట్టారు. మూడు రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఏశాల గంగాధర్ మాట్లాడుతూ గతంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేయడంతో మంత్రి కెటిఆర్ స్పందించి పంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇచ్చేలా మూడు మాసాల్లో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని కానీ పద్దెనిమిది నెలలు గడిచినా మంత్రి హామీ నెరవేరలేదని విమర్శించారు. పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వీరికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్‌బాబు మండల అధ్యక్షుడు కె.పి.క్రిష్ణారెడ్డి, పట్టణ కార్యదర్శి ఏశాల రవీందర్, కోట గంగారెడ్డి, మండవ శ్రీనివాస్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.

బాలసదన్‌లో విద్యార్థిని మృతిపై మెజిస్టీరియల్ విచారణ
ఇందూర్, మార్చి 6: జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల బాలసదన్‌లో గత ఫిబ్రవరి 6వ తేదీన రావుల లుదిన అనే బాలిక అనారోగ్యంతో మృతి చెందిన ఉదంతంపై కలెక్టర్ యోగితారాణా మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించగా, ఈ నెల 14న ఉదయం 11గంటలకు తన కార్యాలయంలో ఈ సంఘటనపై విచారణ జరుపనున్నట్టు ఆర్డీఓ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు విచారణకు హాజరై తమ వాంగ్మూలం అందించాలని ఆర్డీఓ కోరారు.