నిజామాబాద్

కంది రైతుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధారి, మార్చి 6: తాము పండించిన కంది పంటను గాంధారి మార్కెట్ యార్డులో కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ సోమవారం రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా కంది పంటను తీసుకువచ్చిన ట్రాక్టర్లను నిలిపి నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పలు గ్రామాలకు చెందిన చాలా మంది రైతులు సోమవారం కంది పంటను వివిధ వాహనాల్లో గాంధారి మార్కెట్ యార్డులో విక్రయించేందుకు తీసుకువచ్చారు. కానీ మార్కెట్ యార్డులో కంది పంటకు సంబంధించిన కొనుగోలు నిలిపివేయడంతో చాలా సేపు ఎదురుచూసిన రైతులు వారి వాహనాలతో సహా మండల కేంద్రంలోని నెహ్రూ విగ్రహం వద్దకు చేరుకుని కామారెడ్డి-బాన్స్‌వాడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై అనేక ట్రాక్టర్లను నిలిపి ఉంచారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వారికి గాంధారి అఖిలపక్షం నేతలు పూర్తి మద్దతును తెలుపుతూ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు, రైతులు మాట్లాడుతూ గతంలో రైతులు పత్తి పంటను సాగు చేయవద్దని ప్రభుత్వం చెప్పడం జరిగిందని, దాని స్థానంలో కంది పంటను సాగు చేయాలని చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేశారు. తాము ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకుని కంది పంటను సాగు చేస్తే ఇప్పుడు పంటను కొనుగోళు చేయకపోవడం ఏమిటన్నారు. దీనిని బాధ్యత ఎవరు వహిస్తారని ఆరోపిస్తూ మార్కెట్ కమిటీ సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వద్దన్న పత్తి పంటకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం తాము సాగు చేసిన కందిపంటను ఇప్పుడు కొనుగోలు చేయడం మానేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇక్కడికి వచ్చే వరకు తాము కదిలేది లేదని రైతులు మొండికేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజేష్ అక్కడికి చేరుకుని రైతులను, అఖిలపక్షం నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవడంతో మార్కెట్ కమిటీ చైర్మన్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. అనంతరం కంది పంటను కొనుగోళు చేస్తామని చెప్పడంతో శాంతించిన రైతులు ఆందోళనను విరమించి మార్కెట్ యార్డుకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నేతలు పోతంగల్ కిషన్‌రావు, సంగని బాలయ్య, తూర్పు రాజులు, సాయికుమార్, కామెల్లి బాల్‌రాజ్, కమ్మరి సాయిలు, ఎండ్రాల గోపాల్, ఇబ్రహిం ఘోరీ, మదార్, బంజ శంకరప్ప, ప్రేమ్, శంషోద్దీన్, రైతులు కుమ్మరి నారాయణ, రాములు, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

పేదల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
అర్బన్ ఎమ్మెల్యే బిగాల
కంఠేశ్వర్, మార్చి 6: పేదల కోసమే ప్రభుత్వం పని చేస్తోందని, దీనిని గుర్తించి ప్రజలు కూడా ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా అన్నారు. సోమవారం నగరంలోని అర్సపల్లిలో పట్టణ ఇందిర క్రాంతి పథం కింద స్వయం సహాయక సంఘాల శిక్షణ కేంద్ర భవనాన్ని ప్రారంభించగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా పింఛన్లు అందించడం జరుగుతుందన్నారు. ఒంటరి మహిళలకు కూడా వేయి రూపాయల భృతి అందించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారని, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధి జలాలు అందించనున్నారని తెలిపారు. ఇక అర్సపల్లి విషయానికి వస్తే మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా అర్సపల్లిలోని చెరువుకు 50లక్షలతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఏప్రిల్, మే మాసాల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు. త్వరలోనే అంగన్‌వాడీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయిస్తానని చెప్పారు. ఐకెపి భవనాన్ని ప్రారంభించినందున తన సొంత డబ్బులతో కార్పెట్లు, కూలర్లు, బాత్రూమ్‌లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. పేదల కోసమే ప్రభుత్వం పని చేస్తున్నందున, తమకు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. అంతకుముందు నగరంలోని 27వ డివిజన్‌లో 39లక్షల రూపాయలతో సిసి డ్రైన్, సిసి రోడ్డు పనులకు, 50వ డివిజన్‌లో 14లక్షలతో చేపడుతున్న సి.సి డ్రైనేజీ పనులకుశంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఫహీం, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్, సిబ్బంది, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.