నిజామాబాద్

కుటుంబాల్లో కలహాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మార్చి 7: సమాజంలో ముందు కుటుంబాలు బాగుండాలని తద్వారానే దేశాభివృద్ధి చెందుతోందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ - జిల్లా మహిళా సహకార సమాఖ్య కామారెడ్డి ఆధ్వర్యంలో, సొసైటి ఫర్ రిహాబిలిటేషన్ అండ్ కౌనె్సలింగ్ ఆర్గనైజేషన్ ద్వారా కుటుంబ స్నేహిత డివిజనల్ కౌనె్సలింగ్ కేంద్రాల ద్వారా ఆనందమయ కుటుంబాలను పునర్మించడంపైన ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శే్వతాలు హాజరు అయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో ఒక్కరు బాగులేకున్న ఆకుటుంబంలో సమస్యలు వస్తాయని, ఆ కుటుంబం ద్వారా సమాజం, సమాజం ద్వారా దేశం పాడైపోయే అవకాశాలుంటాయని అన్నారు. ముఖ్యంగా కుటుంబంలో ఏలాంటి కలహాలు లేకుండా చూసుకోవాలని అన్నారు. వారి కుటుంబం పై ఆ కుటుంబంలోని మహిళలకు పూర్తి అవగాహన కల్గి నాడు ఆ కుటుంబాన్ని సక్రమమైన మార్గంలో నడిపించగలిగే శక్తి వస్తుందన్నారు. తద్వారా సమాజంలో మంచి సాంకేతాలు వెళ్తాయని, ఇలా అభివృద్ధి పథకంలో కుటుంభాలు ముందుకు సాగుతే దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. దీని కోసం కృషి చేస్తున్న వారిని కలెక్టర్ అభినందించారు. మనదేశంలో ఒంటరిగా బతికే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని, ఇలాంటి వారు ప్రేమను పంచుకుని కలిసి మెలసి జీవించాలని కోరుకోవాలే, తప్ప ప్రేమానుబందాలను తెంచుకోవద్దని అన్నారు. ఎస్పీ శే్వత మాట్లాడుతూ, సమాజంలో కుటుంభాల్లో ఏలాంటి కలహాలు లేకుండా కుటుంబ పెద్దలు చూసుకోవాల్సిన అవసరం ఉందని, చిన్నచిన్న సమస్యలను భూతద్దంలో చూడవద్దని కోరారు. కలిసి ఉన్న కుటుంభాల్లో ఎంతో సుఖసంతోషాల ఉంటాయని అన్నారు. చిన్నపాటి కలహాలు ఉన్న కుటుంభాల్లో సైతం వారి కలహాలను దూరం చేసుకుని కలిసి మెలిసి ఉండాలని కోరారు. పోలీసు శాఖ ద్వారా కూడా కుటుంభాల్లో జరిగే గొడవలను కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించేలా తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓతో పాటు మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు.