నిజామాబాద్

ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మార్చి 9: ఇంటర్ ఫలితాలను సకాలంలో ప్రకటించేందుకు వీలుగా ఓ వైపు పరీక్షలు కొనసాగుతున్న తరుణంలోనే ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు ప్రశ్నపత్రాల మూల్యాంకనం ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపడుతున్నారు. గురువారం సంస్కృత భాష మూల్యాంకనం జరిపారు. ఈ సందర్భంగా పేపర్ వాల్యుయేషన్ విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిని ఉద్దేశించి ఉమ్మడి జిల్లాల ఇంటర్మీడియెట్ విద్యాధికారి డి.ఒడ్డెన్న పలు సూచనలు చేశారు. మూల్యాంకనంలో పాల్గొంటున్న ఎగ్జామినర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదు విధానం అమలు చేస్తున్నందున సకాలంలో విధులకు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి అలసత్వానికి, తప్పిదాలకు తావులేకుండా మూల్యాంకనం ప్రక్రియను సజావుగా చేపట్టాలని అన్నారు. మూల్యాంకనం విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే ముందుగానే వాటిని నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జామినర్లు, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.