నిజామాబాద్

సిసి రోడ్డు పనులు ప్రారంభించాలంటూ కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, మార్చి 9: డివిజన్ కేంద్రంలో నిలిచిన సిసి రోడ్డు పనులు ప్రారంభించాలంటూ, గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లమడుగు సురేందర్ నేతృత్వంలో, ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ మండలాల కాంగ్రెస్ నాయకులు పట్టణంలో, ధర్నా చేసేందుకు ప్రయత్నించారు. దీంతోస్థానిక సిఐ సుధాకర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్ ఎస్‌ఐలు శ్రీ్ధర్‌రెడ్డి, సితారామరాజు, సంపత్‌లు అడ్డుకున్నారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున, ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని కాంగ్రెస్ నాయకులతోచెప్పి ధర్నాను అడ్డుకున్నారు. దీంతో నిలిచిన రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు కాలినడకన గాంధీ చౌక్ వరకు చేరుకున్నారు. అక్కడ రెండు నిమిషాల పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మాట్లాడారు. పట్టణ రహదారి సిసి రోడ్డుపనులు అంసంపూర్తిగా ఉండటం పట్ల దుమ్మదూళితోపట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారన్నారు. సిసి రోడ్డుపనులను అర్థాంతరంగా ఆపి పట్టణ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. నిలిచిన పనులు పూర్తి చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం స్థానిక పోలీసులు నల్లమడుగుసురేంధర్‌తోపాటు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నలక్ష్మణ్, సర్దార్ సింగ్, కుడుముల సత్యం, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్‌చేసి పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ వద్ద కాంగ్రెస్ నాయకులు కాసేపు వాగ్వివాదానికి దిగారు. స్వంత పూచికత్తుపై విడుదల చేశారు. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్‌కు నిరసనగా పట్టణంలోదుకాణాలను కాంగ్రెస్ నాయకులు బంద్ చేయించారు. మరోవైపు పోలీసులు దుకాణాలు బంద్ చేయవద్దని దుకాణాల యజమానులకు సూచించారు. ఈఆందోళన కార్యక్రమంలోస్థానిక పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్నసతీష్, నాగిరెడ్డిపేట్ ఎంపిటిసి సభ్యులు మనోహర్‌రెడ్డి, ఇమ్రాన్ సాజిద్, లింగం, ముజ్జు, అబ్దుల్ అలీ, బిట్ల సురేంధర్ తదితరులు ఉన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
మున్సిపల్ కమిషనర్ శైలజ

ఆర్మూర్, మార్చి 9: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, మహిళా ప్రాంగణ ప్రత్యేక అధికారిణి శైలజ అన్నారు. గురువారం ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రాంగణ సిబ్బంది, శిక్షణ పొందుతున్న బెడ్‌సైడ్ పేషంట్ అసిస్టెంట్, అంగన్‌వాడీ హెల్పర్స్ మహిళా అభ్యర్థినులకు ఆటల పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి కమిషనర్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. మహిళలందరూ మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టి ఆమె అన్నారు. ఈ అంశంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా అధికారిణి ఆర్.జ్యోతి, అరుణకుమారి, పద్మ, ప్రభ, రాజశ్రీ, విజయకుమారి, సోని, లలిత పాల్గొన్నారు.

విజిలెన్స్ అధికారుల దాడులు
43 క్వింటాళ్ల కందుల స్వాధీనం ఇద్దరిపై కేసు నమోదు
గాంధారి, మార్చి 9: గాంధారి మండల కేంద్రంలో గురువారం విజిలెన్స్ అధికారులు పలు ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ దుకాణల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 43 క్వింటాళ్ల కందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీసాయి ట్రేడర్స్‌పై దాడి చేసిన అధికారులకు అందులో అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల కందులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుకాణ యజమాని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం కేదారేశ్వర ట్రేడర్స్‌పై దాడి చేసి 18 క్వింటాళ్ల కందులను స్వాధీనం చేసుకుని దాని యజమాని మహేష్‌పై కేసు నమోదు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇద్దరు వ్యాపారులు వారి వద్ద ఎలాంటి ఫుడ్‌గ్రేన్ లైసెన్స్ లేకుండా అక్రమంగా కందులను నిల్వ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేయడం జరిగిందని విజిలెన్స్ డిఎస్పీ ప్రతాప్ తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సిఐ వినాయక్ రెడ్డి, డిసిటిఓ సంతోష్, ఎస్‌ఐ సంగమేశ్వర్ గౌడ్, ఎఓ విద్యాకర్ రెడ్డి సిబ్బంది పాల్గోన్నారు.