నిజామాబాద్

బెటాలియన్‌ను సందర్శించిన ఐజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, మార్చి 9: డిచ్‌పల్లిలోని 7వ పోలీసు పటాలంను గురువారం తెలంగాణ రాష్ట్ర బెటాలియన్స్ ఐజి అభిలాష బిష్టే సందర్శించారు. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బెటాలియన్‌లో నూతనంగా నెలకొల్పిన ఫిల్లింగ్ స్టేషన్(పెట్రోల్ బంక్)ను ఆమె ప్రారంభించారు. అదేవిధంగా చలివేంద్రం, బెటాలియన్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద నేమ్ బోర్డు, ట్రైనింగ్ సెంటర్ ప్రాంగణంలో ఇటీవల నిర్మించిన రెండు ప్రీ-్ఫ్యబ్రికేటెడ్ బ్యారక్స్, 25 వాష్ రూమ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్, యూనిట్ ఆసుపత్రి, బెటాలియన్ వెల్ఫేర్ సెంటర్, బెటాలియన్ కార్యాలయాలను సందర్శించి కమాండెంట్ వై.శ్రీనివాస్‌రావును పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెటాలియన్‌లో చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐ.జి అభిలాషబిష్టేకు వివరించారు. బెటాలియన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఐ.జి హామీ ఇచ్చారు. ఆమె వెంట నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శే్వతారెడ్డి, బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ వివి.రమణారెడ్డి, 4వ బెటాలియన్ ఇన్‌చార్జి కమాండెంట్ ఎంఎస్.కుమార్, 17వ బెటాలియన్ అదనపు కమాండెంట్ సాంబయ్య, అసిస్టెంట్ కమాండెంట్ డి.ప్రసన్నకుమార్, బెటాలియన్ వెల్ఫేర్ ఆఫీసర్ కె.మహేందర్, ఆర్‌ఐ డి.కృష్ణ తదితరులు ఉన్నారు.