నిజామాబాద్

ఏప్రిల్ నాటికి శుద్ధి జలాలు అందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, మార్చి 11: ఇంటింటికి గోదావరి జలాలను శుద్ధి చేసి తాగునీటిగా అందించే మిషన్ భగీరథ పథకం ద్వారా ఏప్రిల్ నాటికి నీరందించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పనులు జరుగుతున్నప్పటికీ, బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలంలోని 8 గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాలకు ఏప్రిల్ 30 నాటికి శుద్ధి జలాలను అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీని విషయంలో స్థానిక ఎమ్మెల్యే, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి జలాలను మళ్లించి, శుద్ధి చేసి అన్ని గ్రామాల మంచినీటి ట్యాంకులు నింపడం ద్వారా ఇంటింటికి తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టారు. ప్రస్తుతం గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఇంట్రా పైప్‌లైన్ నిర్మాణాలను నాలుగు రోజుల క్రితమే ప్రారంభించారు. బాల్కొండ మండలంలోని 114 గ్రామాలకు నీటిని అందించడానికై గతంలోని ఏర్పాటు చేసిన జలాల్‌పూర్ శుద్ధి జలాల ఎత్తిపోతల పథకాన్ని కూడా మిషన్ భగీరథలోకి అనువయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రధాన పంప్‌హౌస్ నుండి నీటిని మళ్లించేందుకు వీలుగా మోర్తాడ్ మండల కార్యాలయం వద్ద భారీ సంప్‌హౌస్ నిర్మాణ పనులను చేపట్టి, 8మాసాల వ్యవధిలోనే పూర్తి చేశారు. దీనికి నీటిని అందించేందుకు వీలుగా జాతీయ రహదారిని ఆనుకుని పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు గాను పొక్లెయినర్లతో కందకాలు తీస్తున్నారు. దానికి సరిపడా పైప్‌లైన్లను కూడా జాతీయ రహదారికి ప్రక్కనే ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. గ్రామాల్లోనూ ఏర్పాటు చేసిన పైప్‌లైన్ నిర్మాణ పనులను గత సోమవారమే అధికారులు ప్రారంభించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ప్రశాంత్‌రెడ్డి మండల నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయా మండలాల ఎంపిపిలు, జడ్పీటిసిలు జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు. పైప్‌లైన్ నిర్మాణాలన్నీ పంట భూముల్లో నుండే కొనసాగుతుండటంతో రైతులకు ఇబ్బంది కలుగకూడదన్న కారణంగా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. అయితే పంటల కోతలు పూర్తికావడంతో శరవేగంగా పనులు చేపడుతున్నారు. ఒకవైపు పొక్లెయినర్లతో కందకాలు తీయిస్తునే, వెంటది వెంట ప్రత్యేక యంత్రాలతో పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కందకాలు తీసే అవకాశం లేకపోవడంతో ఆధునాతన యంత్రాలతో రోడ్లకు అడ్డంగా అడుగు భాగంలో డ్రిల్లింగ్ చేస్తూ పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. మోర్తాడ్ సంప్‌హౌస్ నుండి కమ్మర్‌పల్లి మండలంలోని గ్రామాలకు నీటిని అందించేందుకు వీలుగా స్థానిక కుందేలు గుట్టపై ఏర్పాటు చేసిన పంప్‌హౌస్‌కు పైప్‌లైన్ అనుసంధించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో పంటలు ఇంకా కోయలేదని, అవి పూర్తయితే ఇంట్రా విలేజ్ పైప్‌లైన్ పనులు మరింత వేగం పుంజుకుంటాయని అధికారులు చెబుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ, ఏప్రిల్ మాసాంతం కల్లా నిర్ధేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసి, లబ్ధిగ్రామాల ప్రజలకు శుద్ధి జలాలు అందిస్తే, ఇచ్చిన హామీ నెరవేరుతుందని, ఆ తర్వాత మిగతా పనులను పూర్తి చేసి అన్ని గ్రామాలకు నీటిని అందించే అవకాశం ఏర్పడుతుందని టిఆర్‌ఎస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఏర్గట్లలో సోలార్ వెలుగులు
మోర్తాడ్, మార్చి 11: మండల కేంద్రమైన ఏర్గట్లలో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. శనివారం గ్రామంలో 12సోలార్ వీధి దీపాలతో పాటు గ్రామంలోని 5 ప్రధాన కూడళ్లలో 5ఐమ్యాక్స్ వీధి లైట్లను హైదరాబాద్ నుండి వచ్చిన ప్రత్యేక నిఫుణుల బృందం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏర్గట్ల సర్పంచ్ శివన్నోళ్ల వైష్ణవి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి గాను వరంగల్ పార్లమెంట్ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ పెద్దమొత్తంలో నిధులు కేటాయించారని, ఆ నిధుల నుండే సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సంపూర్ణ పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన సచివాలయం విద్యుత్ భారాన్ని తగ్గించేలా సోలార్ వీధి లైట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.