నిజామాబాద్

తాగునీటి సమస్యపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఏప్రిల్ 4: మండుతున్న ఎండలతో గ్రామాలు, మారుమూల తండాల్లో తాగునీటి ఇక్కట్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిజామాబాద్, బోధన్, కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారులతో పాటు 36మండలాల ఎంపిడిఓలు, తహశీల్దార్లతో, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో మంచినీటి వసతిపై జెసి సమీక్షించారు. ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ, పారదర్శకంగా ఉంటున్న అధికారులను అభినందించాలని సంబంధిత అధికారులతో అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల ప్రజలతో పాటు మారుమూల తండాల గిరిజనులకు సైతం అవసరమైన నీటిని అందించేందుకు అధికారులు దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో వట్టిపోయిన బోరుబావులను ఫ్లెషింగ్ చేయిస్తే ఖచ్చితంగా నీరు వస్తుందనే నివేదికలు ఉంటేనే ఫ్లెషింగ్ చేయించాలని, లేదంటే అద్దె ప్రాతిపదికన రైతుల బోరుబావులను అద్దెకు తీసుకోవాలన్నారు. వీటి నుండి తాత్కాలిక పైప్‌లైన్లు ఏర్పాటు చేసి ప్రజలకు నీటిని అందించాలని అన్నారు. సంవృద్ధిగా నీరు ఉన్న బోరుబావులకు విద్యుత్ సౌకర్యం లేకపోతే ట్రాన్స్‌కో ఎస్‌ఇకి సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సమర్పించి తక్షణమే (నాన్-సిఆర్‌ఎఫ్) కింద విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని జెసి పేర్కొన్నారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు రైతుల నుండి అద్దెకు తీసుకుంటున్న బోరుబావుల అద్దెను నెలనెలా చెల్లించాలని, దీంతో ఇతర రైతులు కూడా తమ బోరుబావులను అద్దె రూపేణా ఇచ్చేందుకు ముందుకు వస్తారని జెసి సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎజెసి రాజారాం, డ్వామా పిడి వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

మిషన్ కాకతీయ పనులు ప్రారంభం

ఆర్మూర్, ఏప్రిల్ 4: ఆర్మూర్ మండలంలోని గోవింద్‌పేట్, సుర్భిర్యాల్, చేపూర్, కోటార్మూర్ గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. గ్రామాల్లోని చెరువుల పునరుద్దరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గడ్డపారలతో మట్టిని తవ్వి తట్టల ద్వారా తలపై ఎత్తుకొని ట్రాక్టర్లలో పారేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల పునఃరుద్దరణ ద్వారా పూర్వవైభవం వస్తుందని అన్నారు. చెరువుల్లో పుష్కలంగా నీరుంటే అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని ఆయన చెప్పారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులను పారదర్శకంగా చేపట్టాలని ఆయన సూచించారు. రైతులు స్వచ్ఛందంగా మట్టిని తమ పంట పొలాలకు తరలించుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సాందన్న, ఎంపిపి పోతు నర్సయ్య, వైస్ ఎంపిపి ఇట్టెడి బాజన్న, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఇట్టెడి లింగారెడ్డి, సర్పంచ్‌లు మూగ ప్రభాకర్, సత్యనారాయణ, లక్కారం విజయలక్ష్మీ, టిఆర్‌ఎస్ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, ఏనుగు సాయరెడ్డి, సంజయ్‌సింగ్ బబ్లూ, జాగిర్ధార్ శ్రీను, ఆనంద్‌రెడ్డి, అబ్దుల్ నయ్యూం, సుంకరి రంగన్న తదితరులు పాల్గొన్నారు.