నిజామాబాద్

వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు 100 సీట్లు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మార్చి 19: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీకి 100సీట్లు రావడం ఖాయమని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన వి.గంగాధర్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దుతున్న తరుణంలో తనకు రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నిక చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎంపి కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ బిసిలతో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. చట్టసభల్లో బడుగు బలహీనవర్గాల ప్రజలకు సుముచిత స్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రికి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేజీ టూ పీజీ విద్య అమలులో భాగంగా ఇప్పటికే 500 గురుకుల పాఠశాలలను ప్రారంభించిన ప్రభుత్వం, కులవృత్తులకు ప్రాధాన్యత కల్పించడంతో బిసిలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ, సాగునీటిని అందించేందుకు మిషన్ కాకతీయ, ఇన్‌పుట్ సబ్సిడీని అందించడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక చేయూత అందించేందుకు గాను కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ ఒక్కో పెళ్లి కూతురుకు 75,116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. అర్హులందరికి పెన్షన్లు, ఆహార భద్రత కార్డుల ద్వారా ఒక్కోక్కరికి 6కిలోల చొప్పున బియ్యం, బీడీ కార్మికులకు జీవన భృతి, ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటి అందించేందుకు మిషన్ భగీరథ పథకాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ, అర్హులకు లబ్ధి చేకూరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికై జిల్లాకు తొలిసారి వచ్చిన విజి.గౌడ్‌కు నగర శివారులోని మాధవనగర్ వద్ద టిఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ విజి.గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుండి చేపట్టిన ర్యాలీ ఆర్ అండ్ బి అతిథి గృహం వరకు కొనసాగింది. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఎఎస్.పోశెట్టి, అలీం. డిసిసిబి చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు.