నిజామాబాద్

మాజీ మంత్రిపై అక్రమ కేసును నిరసిస్తూ కాంగ్రెస్ బైక్ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, మార్చి 20: గడిచిన 15సంవత్సరాల కాలంలో బోధన్ శాసన సభ్యుడిగా, మంత్రిగా నియోజకవర్గ ప్రజలకు విశేష సేవలు అందించిన మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులపై టిఆర్‌ఎస్ నాయకులు అక్రమ కేసులు బనాయించడం శోచనీయమని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాసాడ నర్సింగ్ ఆరోపించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బోధన్ నియోజకవర్గం బంద్ పిలుపులో భాగంగా సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్ పాటించారు. మండల కేంద్రంలో కొన్ని దుకాణదారులు స్వచ్ఛందంగా మూసి ఉంచగా, అక్కడక్కడా తెరిచి ఉంచిన దుకాణాలను కాంగ్రెస్ నాయకులు మూసి వేయించారు. అనంతరం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి ప్రధాన కార్యదర్శి యాసాడ నర్సింగ్ మాట్లాడుతూ, రెంజల్ మండలంలో గత కాంగ్రెస్ హయాంలో పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి కందకుర్తి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడం జరిగిందన్నారు. చివరి సమయంలో అదనంగా భూమి అవసరం కావడంతో భూ సేకరణలో కొంత జాప్యం జరిగిందన్నారు. భూమిని సేకరించిన అనంతరం అదనపు నిధులను మంజూరీ చేయగా, ఇటీవల పూర్తి చేయడం జరిగిందన్నారు. అయితే కందకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నారన్న విషయాన్ని స్థానిక రైతుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పలువురు పార్టీ నాయకులతో కలిసి చూసేందుకు కందకుర్తి ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లగా, అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా కేసులు నమోదు చేయించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు రౌడీయిజాన్ని మానుకుని, ప్రజాస్వామ్యబద్దంగా నడుచుకోవాలని, లేదంటే సరైన సమయంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ బంద్‌లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్లయ్యయాదవ్, జిల్లా నాయకులు నాయిని బలరాం, పెరిక లక్ష్మన్, యూత్ కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గం అధ్యక్షుడు శ్రీ్ధర్, ఠాణాకలాన్ ఎంపిటిసి ఆకుల సురేష్, నాయకులు భాస్కర్‌రెడ్డి, బాపునగర్ లింగం, కె.శ్రీనివాస్, బాబా, ఇస్మాయిల్, సరిచంద్, శ్రీనివాస్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

31లోగా ఆస్తిపన్ను చెల్లించాలి
* మేయర్ సుజాత
కంఠేశ్వర్, మార్చి 20: నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న భవన యజమానులంతా మార్చి 31వ తేదీలోగా అన్ని రకాల ఆస్తి పన్నులను చెల్లించాలని నగర మేయర్ ఆకుల సుజాత పేర్కొన్నారు. సోమవారం కార్పొరేషన్‌లోని తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మేయర్ ఆకుల సుజాత మాట్లాడారు. ప్రతి సంవత్సరం భవన యజమానులు ఆస్తిపన్ను చెల్లించే సమయంలో వడ్డీ మాఫీ ఉండేదని, ఈసారి ప్రభుత్వం వడ్డీ మాఫీ ఉండదని స్పష్టం చేసినందున ప్రతి ఒక్కరు ఈ నెల 31లోగా ఆస్తిపన్ను చెల్లించాలని ఆమె కోరారు. ఆస్తిపన్ను మొత్తం 18.45కోట్లు టార్గెట్ కాగా, ఇప్పటి వరకు 10.35కోట్లు వసూలు చేయడం జరిగిందన్నారు. ఇంకా 7.75కోట్లు వసూలు కావాల్సి ఉందని, త్వరలోనే ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆస్తిపన్నులు సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని మేయర్ సుజాత కోరారు. అదే విధంగా నీటి పన్నులు సైతం పెద్దమొత్తంలో బకాయిలు ఉన్నాయని, వీటిని కూడా సకాలంలో చెల్లించేందుకు వినియోగదారులు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. కమిషనర్ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, నగరంలో వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున ప్రజలు సహకరించాలన్నారు. నీటిపన్ను, ఆస్తిపన్ను సకాలంలో చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.