నిజామాబాద్

సకల జనులందరికీ సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, మార్చి 21:తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సకల జనులందరికీ భవిష్యత్తులో లబ్ధి చేకూరే విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టబోతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మానిక్‌బండార్ గ్రామంలో మంగళవారం తెరాస మండల అధ్యక్షుడు ఎం.ప్రభాకర్ నేతృత్వంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో రాష్ట్రాన్ని పరిపాలించిన ఏ ముఖ్యమంత్రి చేయలేని రీతిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను కెసిఆర్ అమలు చేసి చూపిస్తున్నారని అన్నారు. ఇప్పటికే అంతరించిపోతున్న కులవృత్తులకు మళ్లీ జీవం పోసేందుకు ప్రత్యేక పథకాలు చేపట్టి, నూటికి నూరు శాతం సబ్సిడీ ఇస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు. కుమ్మరి, కమ్మరి, బేస్త, గొల్లకుర్మలే కాకుండా రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుండి తగిన సహకారం అందించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కెసిఆర్ చేపడుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను గుర్తిస్తున్న ప్రజలు ముఖ్యమంత్రికి బ్రహ్మరథం పడుతున్నారని, దీనిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. సిఎం కెసిఆర్ స్ఫూర్తితో ఆర్మూర్ ఎమ్మెల్యేగా తాను కూడా నెంబర్ వన్ స్థానంలో ఉన్నానని అన్నారు. దశాబ్దాల కాలంగా మరుగునపడి ఉన్న అనేక పెండింగ్ పనులను పూర్తి చేయించానని చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్‌వన్‌గా నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తెరాస పార్టీ పట్ల ప్రజల్లో ఎంతో సదభిప్రాయం ఉందని, అందుకు ప్రతి తెరాస నాయకుడు సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, దాదన్నగారి విఠల్‌రావు, ఆకుల రజనీష్, బడుగు సత్యం, జిబి.గోవర్ధన్, నేమూరి నర్సాగౌడ్, కొత్తపల్లి సుబ్బారావుతో పాటు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
కలెక్టర్ సత్యనారాయణ
బిచ్కుంద, మార్చి 21: పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. మంగళవారం బండరెంజల్, గుండానెమలి, వజీద్‌నగర్, పుల్కల్ గ్రామాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను కాలినడకన వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న, వరి, తదితర పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కామారెడ్డికి పాదయాత్రగా వచ్చి బాధలు చెప్పుకున్నారని, కేవలం ఫోన్ చేస్తే తానే వచ్చేవాడినని పేర్కొన్నారు. ఇక ముందు రైతులు ఏమైన సమస్యలుంటే సంబంధిత అధికారులకు తెలుపాలని రైతులకు సూచించారు. అధికారులు స్పందించకుంటే తనకు ఫోన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. కౌలు రైతులకు త్వరలోనే గుర్తింపు కార్డులను అందిస్తామన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పంట నష్టం వివరాలను సేకరించి ఆ నివేదికలను ప్రభుత్వానికి పంపి బాధిత రైతులకు ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తామన్నారు. బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రైతుల సమస్యలను స్థానిక తహశీల్దార్ పట్టించుకోవడం లేదని పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అకాల వర్షం వల్ల తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్నాయని, తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత రైతులు కలెక్టర్ విన్నవించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్‌డిఓ రాజేశ్వర్, తహశీల్దార్ గోవర్ధన్, వ్యవసాయాధికారి పోచయ్య, జడ్పిటిసి సాయిరాం, బాధిత రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.