నిజామాబాద్

బడాపహాడ్ ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 23: బడాపహాడ్(పెద్దగుట్ట) ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి పద్మాకర్ అధికారులను ఆదేశించారు. వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామంలో గల హజరత్ సయ్యద్ షాదుల్లా హుస్సేనీ(రహమతుల్లా అలైహ్) బడాపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఏప్రిల్ 8, 9, 10వ తేదీలలో మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. యేటేటా జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు హాజరుకానున్నారు. ప్రతీసారి వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ ఉర్సు ఉత్సవాలు జరిగేవి కాగా, సౌకర్యాల పరంగా అంతగా దృష్టిసారించకపోవడంతో సదుపాయాల లేమి వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ విషయమై జిల్లా యంత్రాంగంతో పాటు ప్రభుత్వానికి కూడా అనేక ఫిర్యాదులు అందాయి. సాధారణ సమయాల్లోనూ బడాపహాడ్ దర్గా వద్ద భక్తులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు స్పందించిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలుమార్లు ఈ దర్గాను సందర్శించి అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి కొంతవరకు పరిస్థితులను చక్కదిద్దడంలో కృతకృత్యులయ్యారు. ఈ క్రమంలోనే ఉర్సు ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను సైతం ప్రభుత్వం అధికార యంత్రాంగానికే అప్పగించింది. ఈసారి ఉర్సును అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన దరిమిలా, ఉర్సు ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా భావించిన జిల్లా యంత్రాంగం ముందస్తుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టడంలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా కలెక్టర్ యోగితారాణా ఆదేశాల మేరకు గురువారం జిల్లా రెవెన్యూ అధికారి పద్మాకర్ తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై బడాపహాడ్ ఉర్సు ఉత్సవాలకు చేపట్టాల్సిన చర్యలపై వారితో సమీక్ష జరిపారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదివరకు వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కొనసాగేవని, భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తొలిసారిగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఆదేశించిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఏర్పాట్లను చక్కబెట్టాలన్నారు. వేలాదిగా హాజరయ్యే భక్తులందరికీ వసతి, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. బడాపహాడ్ వద్ద ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లు, స్నానాల గదులు ఉర్సు సమయంలో హాజరయ్యే భక్తులకు సరిపోయే అవకాశాలు లేనందున మరో 20ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులను ఏర్పాటు చేయాలన్నారు. వీటిని వెంటదివెంట శుభ్రం చేసేలా చర్యలు చేపట్టాలని, తద్వారా పరిసరాలు కలుషితం కాకుండా చూడాలని, ఈ మేరకు సానిటేషన్ సిబ్బంది ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తిని ఆదేశించారు. భక్తులకు రక్షిత మంచినీటిని అందుబాటులో ఉంచాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు సూచించారు. బడాపహాడ్ వద్ద ఉర్దు ఉత్సవాలు ముగిసేంత వరకు కూడా ప్రథమ చికిత్సా కేంద్రంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్‌ను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా అంబులెన్స్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా నిరంతరం కరెంటు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో అధికారులకు సూచించారు. జలాల్‌పూర్ నుండి బడాపహాడ్ వరకు సందల్ తీసుకుని వచ్చే సమయంలో వేలాది మంది భక్తులు పాల్గోనున్నందున గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని బోధన్ డిఎస్పీ వెంకటేశ్వర్లుకు సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భక్తులకు తాగునీటి సరఫరా కోసం మంచినీటి ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. వాహనాలను ఆయా కేటగిరీల వారీగా వేర్వేరు పార్కింగ్ స్థలాలను ఎంపిక చేయాలన్నారు. శుక్రవారం బడాపహాడ్‌ను సందర్శించి దర్గా కమిటీ ప్రతినిధులతోనూ చర్చించిన మీదట మరింత విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడతామని డిఆర్‌ఓ పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కిషన్, సమాచార శాఖ డి.డి మహ్మద్ ముర్తుజా, కలెక్టరేట్ ఎ.ఓ శ్రీ్ధర్, డిప్యూటీ తహశీల్దార్ రషీద్, ఆర్‌డబ్ల్యుఎస్, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ
పొలిట్‌బ్యూరో సభ్యుడు పోశెట్టి

కంఠేశ్వర్, మార్చి 23: ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని, ఈ మేరకు కెసిఆర్ నేతృత్వంలోని తెరాస ప్రభుత్వానికి ప్రజలు తమవంతు సహకారం అందించాలని టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు పోశెట్టి కోరారు. గురువారం నగరంలోని తన నివాస గృహంలో టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోశెట్టి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలోనే మరెక్కడా లేనివిధంగా అన్ని వర్గాల వారి కోసం సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి రక్షిత మంచినీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు అందిస్తున్నారని, ఇటీవలే ఒంటరి మహిళలకు కూడా జీవన భృతి కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి కింద 51వేల రూపాయలను 75వేల రూపాయలకు పెంచడం వల్ల ఎంతోమంది పెద్దఎత్తున లబ్ధి చేకూరుతుందన్నారు. బిసి, మైనార్టీ వర్గాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు ఈర్లశేఖర్, సాయికుమార్, తదితరులు సభ్యత్వం తీసుకున్నారు.