నిజామాబాద్

1న ప్రైవేట్ ఆసుపత్రుల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మార్చి 23: దేశ వ్యాప్తంగా డాక్టర్లపై పెచ్చుమీరుతున్న దాడులను నిరసిస్తూ ఏప్రిల్ 1వ తేదీన ప్రైవేట్ ఆసుపత్రుల బంద్ పాటిస్తున్నామని తానా, ఐఎంఎ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, రవీంద్రనాథ్ సూరి పేర్కొన్నారు. గురువారం నగరంలోని విజన్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలలో డాక్టర్లపై దాడులు అధికం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం మహారాష్టల్రోని దూలే మెడికల్ హాస్పిటల్‌లో రెసిడెన్సీ డాక్టర్లపైన రోడ్డు ప్రమాద బాధితుడి బంధువులు దాడి చేయడంతో డాక్టర్లు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. ప్రభుత్వాలు వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోనూ తరుచూ ఈ తరహా దాడులు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రైవేట్ వైద్యులను దోషులుగా చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నారని, తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. డాక్టర్లకు న్యాయం చేయమని మహారాష్ట్ర న్యాయస్థానంను ఆశ్రయిస్తే, వృత్తి చేయకుంటే ఇంట్లో కూర్చోవాలని చెప్పడం శోచనీయమన్నారు. ధన, మాన, ప్రాణాలను కాపాడాలని రాజ్యాంగంలో పేర్కొనడం జరిగిందని, దీనిని అనుసరిస్తూ ప్రభుత్వాలు తమకు ప్రాణ రక్షణ కల్పిస్తే బాగుంటుందని, లేనిపక్షంలో తామే రక్షణ కల్పించుకుంటామని అన్నారు. డాక్టర్లు దేవుళ్లు కాదని, అలాగే రాక్షసులూ కారని అన్నారు. వీలైనంత వరకు రోగి ప్రాణాలను కాపాడేందుకు తాము కృషి చేస్తామన్నారు. డాక్టర్లపై దాడులను నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేస్తామని, ఏప్రిల్ 1న బంద్ పాటిస్తామన్నారు. బంద్ కార్యక్రమానికి ప్రజలు సహకరించలాని కోరారు. విలేఖరుల సమావేశంలో తానా, ఐఎంఎ ప్రతినిధులు కవితారెడ్డి, రాంచందర్, నీలి రాంచందర్, విశాల్, వినోద్‌కుమార్ గుప్తా, అరుణ, మల్లేశ్వరి, అజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఉరేసుకొని ఇద్దరి ఆత్మహత్య
సదాశివనగర్, మార్చి 23: మండల కేంద్రానికి చెందిన ఇద్దరు అనారోగ్యాల కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ, హరిజన వాడలో నివాసం ఉంటున్న రాజవ్వ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై వారసులు ఎవరు లేకపోవడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అలాగే బిసి కాలనీలో నివాసం ఉంటున్న అవుసుల రాజేశ్వరీ(45) అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందని జీవితంపై విరక్తి చెంది ఇంట్లో రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు దుబాయిలో ఉండడంతో కోడలు సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఎబివిపి ఆధ్వర్యంలో బలిదాన్ దివస్
కంఠేశ్వర్, మార్చి 23: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పరిషత్ కార్యాలయంలో భగత్‌సింగ్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా కన్వీనర్ రాకేష్ మాట్లాడుతూ, భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు 23వ ఏటనే భరతమాత పాదాలకు భగత్‌సింగ్ తన ప్రాణాలను సమర్పించారని అన్నారు. భారతదేశంలో ఉన్న యువకిశోరాలకు భగత్‌సింగ్ ఆదర్శంగా నిలిచారని, ఆంగ్లేయుల గుండెల్లో బాంబుల వర్షం కురిపించిన మహా యోధుడని కొనియాడారు. మహాత్మాగాంధీ తలపెట్టిన అహింసామార్గం ద్వారా స్వాతంత్య్రం సిద్ధించదని, రక్తపు బొట్టు నేలపై చిందిస్తేనే స్వాతంత్య్రం వస్తుందని భావించి హింసా మార్గాన్ని ఎంచుకుని హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నగర కార్యదర్శి రంజిత్‌కుమార్, ప్రవీణ్, సాయికుమార్, రిషికేశ్, సాయినాథ్, నితిన్, మనోజ్, రవిచందర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో...
కాగా, బిజెపి ఆధ్వర్యంలో నగరంలోని దేవీరోడ్ చౌరస్తాలో భగత్‌సింగ్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు యెండల సుధాకర్ మాట్లాడుతూ, భగత్‌సింగ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే పిడిఎస్‌యు ఆధ్వర్యంలో భగత్‌సింగ్ భగత్‌సింగ్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటీష్ వారిని గడగడలాడించిన యోధుడు భగత్‌సింగ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, భగత్‌సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకుని దేశాన్ని సామ్రాజ్యవాద శక్తుల కబంద హస్తాల నుండి కాపాడేందుకు యువత ఉద్యమించాలని కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో నగరంలోని 39వ డివిజన్‌లోని అంబేద్కర్ కాలనీలో గల భగత్‌సింగ్ విగ్రహానికి నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ పూలమాలలు వేసి నివాళులర్పించగా, సిపిఐ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి సుధాకర్ నివాళులర్పించారు.