నిజామాబాద్

మూడు మాసాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 23: మిషన్ భగీరథ కింద ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు వీలుగా జిల్లాలో చేపడుతున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం పనులను మూడు మాసాల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో మిషన్ భగీరథ, అసైన్‌మెంట్ స్థలాలపై సమీక్ష జరిపారు. వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజర్ అయిన అధికారులపై కలెక్టర్ ఒకింత అసహనం వెళ్లగక్కారు. భీమ్‌గల్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, నవీపేట ఆర్‌డబ్ల్యుఎస్ ఎ.ఇలు డుమ్మా కొట్టడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ మండలంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎ.ఇలకు బయోమెట్రిక్ విధానం ద్వారానే హాజరు నమోదు చేయాలని, హాజరును అనుసరిస్తూనే జీతభత్యాలు చెల్లించాలన్నారు. ఈ విషయంలో ఎంపిడిఓలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ఎ.ఇల హాజరు గురించి పట్టించుకోని అధికారులను ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ హెచ్చరించారు. కాగా, జిల్లాలో మిషన్ భగీరథ కార్యక్రమం కింద 463 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ల నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే 85శాతం మార్కింగ్ పనులు పూర్తయ్యాయని, మిగతా 15శాతం మార్కింగ్ ప్రక్రియను కూడా శుక్రవారం లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా స్థల సమస్య నెలకొని ఉంటే తహశీల్దార్‌లను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ట్యాంకుల నిర్మాణాలకు గాను ఒప్పందాలు పూర్తయిన వాటి పనులను శనివారంలోపు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్యాంకుల నిర్మాణం పనుల్లో అలసత్వానికి తావు లేకుండా, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. కాగా, పేద వర్గాల వారికి ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్‌మెంటు భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపాలని రెవెన్యూ, మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా బీడు భూములు ఖాళీగా ఉంటే వాటిని సాగుకు యోగ్యంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలన్నారు. ముందుగా సాగుకు ఉపయుక్తంగా ఉన్న భూములను గుర్తించి, ముళ్ల పొదలు, చెట్లను తొలగింపజేయాలని సూచించారు. ఇతర భూముల్లో స్థలాలను చదును చేయించి, ఫాంపాండ్‌లు, బండ్‌ఫార్మేషన్ పనులు చేయించాలని, తహశీల్దార్, ఎంపిడిఓలు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా అసైన్డ్ భూములను పరిశీలించి పై చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సాగుకు యోగ్యంగా ఉన్న భూములు, అభివృద్ధి చేయాల్సి ఉన్న భూములను నిర్ధారిస్తూ పూర్తి వివరాలతో తనకు నివేదికలు అందించాలన్నారు. భూమి అభివృద్ధి ప్రక్రియ పూర్తయిన తరువాతనే చేతిపంపులు, విద్యుత్ కనెక్షన్లు ఇస్తామన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లు, టెక్నికల్ అసిస్టెంట్‌లు రోజువారీగా భూమి అభివృద్ధి పనులకు చర్యలు చేపట్టేలా చూడాలన్నారు. ఇరవై ఎకరాలకు పైబడి ఉన్న అసైన్డ్ భూముల్లో డీమార్కింగ్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయించాలని జెసి రవీందర్‌రెడ్డిని కోరారు. నందిపేట మండలం సిహెచ్.కొండూర్, జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి, బోధన్ మండలం అమ్దాపూర్, ఊట్‌పల్లి, కమ్మర్‌పల్లి మండలం నాగాపూర్, చౌట్‌పల్లి, నవీపేట మండలం అబ్బాపూర్ గ్రామాల్లో 20ఎకరాలకు పైబడిన సాగుకు అనుకూలమైన భూములున్నందున ప్రయోగాత్మకంగా అక్కడ భూమి అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి రవీందర్‌రెడ్డి, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, జడ్పీ సిఇఓ గోవింద్, ఎడిఎ వాజిద్‌తో పాటు మిషన్ భగీరథ ఇఇలు పాల్గొన్నారు.

వీర తెలంగాణ పోరాట మహిళ చాకలి ఐలమ్మ
ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి
లింగంపేట్, మార్చి 23: వీర తెలంగాణ పోరాట మహిళ చాకలి ఐలమ్మ అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బాలుర వసతి గృహం ముందు నాటి తెలంగాణ పోరాట మహిళ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని ఇఎన్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన రజకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వీర వనతి చాకలి ఐలమ్మ తెల్లదొరల నిరంకుశ పాలన వ్యతిరేకంగా ముందుండి పోరాడిన మహిళ అని కొనియాడారు. అదే స్ఫూర్తితో మలి దశ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. నేడు కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం రజకులకు ఎన్నో రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రజకులకు 70 శాతం సబ్సిడీపై రుణాలు ఇప్పిస్తామన్నారు. వాషింగ్ మిషన్లపై ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల కేంద్రానికి దోబీఘాట్ మంజూరైనట్లు తెలిపారు. దీనిని పెద్దవాగు సమీపంలో ఏర్పాటు చేసుకుంటే నీటి వసతి బాగుంటుందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని కుల వృత్తుల వారికి అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సతీమణి మంజులరెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు వంజరి ఎల్లమయ్య, ఎంపిపి అసీయామోహిద్, డిసిసిబి డైరెక్టర్ సంపత్‌గౌడ్, రజకుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజయ్య, లింగంపేట్ సర్పంచ్ అఫ్రోజ్, మైనార్టీ సినియర్ నాయకులు మోహిద్, సింగిల్‌విండో చైర్మన్ మదుసుధన్‌రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ ముదాం సాయిలు, నాయకులు అశోక్, వెంకటేశం, నారాగౌడ్, నారాయణ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.